రహస్య గదుల్లో నీచక్రీడలు

రహస్య గదుల్లో నీచక్రీడలు
x
Highlights

వ్యభిచారం వ్యవహారంలో కొత్తపోకడలు, రహస్య గదులను కట్టి వారి ఆగడాలు, హార్మోన్గ్రోత్ ఇంజెక్షన్లు ఇచ్చే నరకాలు, వీటికి లేవా శాశ్వత విరుగుడులు. శ్రీ.కో ...

వ్యభిచారం వ్యవహారంలో కొత్తపోకడలు,
రహస్య గదులను కట్టి వారి ఆగడాలు,

హార్మోన్గ్రోత్ ఇంజెక్షన్లు ఇచ్చే నరకాలు,

వీటికి లేవా శాశ్వత విరుగుడులు. శ్రీ.కో

వ్యభిచారం వ్యవహారంలో మరిన్ని విస్తుగొలిపే అంశాలు వెల్లడయ్యాయి. వ్యభిచార గృహాల్లో బాలికలను, విటులను దాచేందుకు ఏర్పాటైన నేలమాళిగలు వెలుగు చూశాయి. బాలికలను త్వరగా వ్యభిచార వృత్తిలోకి దించేందుకు వీలుగా వారికి ఓ ఆర్‌ఎంపీ హార్మోన్‌ గ్రోత్‌ ఇంజక్షన్లు ఇస్తున్నట్లు వెల్లడయింది. యాదగిరిగుట్ట పట్టణంలో అనురాధ నర్సింగ్‌ హోం నడుపుతున్న ఆర్‌ఎంపీ నర్సింహ కార్యకలాపాలపై సమాచారం అందుకున్న ఎస్వోటీ పోలీసులు ఆసుపత్రిలో సోదాలు నిర్వహించి 43 ఇంజక్షన్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. అక్కడ నిబంధనలకు విరుద్ధంగా హెర్నియా, ట్యూబెక్టమీ, తదితర శస్త్రచికిత్సలూ నిర్వహిస్తున్నట్లు కనుక్కున్నారు. నర్సింహను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ ఆదేశాలతో పోలీసులు చురుగ్గా వ్యవహరిస్తున్నారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో మరోమారు వ్యభిచార గృహాలపై దాడులు నిర్వహించారు. దాడుల సమయంలో విటులు, బాలికలను దాచేందుకు వారి నివాసాల్లో నేలమాళిగలనూ ఏర్పాటు చేసుకున్నట్లు గుర్తించి విస్తుపోయారు. ఆరుగురిని అరెస్టు చేసి, నలుగురు బాలికలకు విముక్తి కల్పించారు. ఈ విషయాలను యాదాద్రి డీసీపీ రాంచంద్రారెడ్డి యాదగిరిగుట్ట ఠాణాలో విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories