మహాకూటమిలో లుకలుకలు...కాంగ్రెస్ తీరుపై...

x
Highlights

మహాకూటమిలో మరోసారి లుకలుకలు బయటపడ్డాయి. కాంగ్రెస్ తీరుపై తెలంగాణ ఇంటి పార్టీ అధినేత చెరుకు సుధాకర్ తీవ్ర మనస్ధాపం చెందారు. మహాకూటమి పొత్తులో సామాజిక...

మహాకూటమిలో మరోసారి లుకలుకలు బయటపడ్డాయి. కాంగ్రెస్ తీరుపై తెలంగాణ ఇంటి పార్టీ అధినేత చెరుకు సుధాకర్ తీవ్ర మనస్ధాపం చెందారు. మహాకూటమి పొత్తులో సామాజిక న్యాయం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన గద్దర్‌తో సమావేశమయ్యారు. మహాకూటమిలో తెలంగాణ ఉద్యమకారులకు చోటు లేకుండా చేశారని ఆరోపించిన చెరుకు సుధాకర్ కాంగ్రెస్ అధిష్టానం ఆలోచనలకు అనుగుణంగా తెలంగాణ నేతలు పనిచేయడం లేదంటూ ఆరోపించారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు అధిక సీట్లు కేటాయించాలని కాంగ్రెస్ అధిష్టానం సూచించినా ఉత్తమ్ కుమార్ రెడ్డి పాటించడం లేదని ఆరోపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories