logo

స్వభావమే ప్రధానం

స్వభావమే ప్రధానం

రామబాణం దెబ్బ రుచి చూసినవాడిగా చెబుతున్నా - సీతాపహరణ ఆలోచన మానుకో అని మారీచుడు జరగబోయేపరిణామాలతోపాటు రావణుడికి చెప్పాడు. రావణుడు వినలేదు. సీతమ్మ మందలించింది . వినలేదు. హనుమ హెచ్చరించాడు. వినలేదు. విభీషణుడు సవరించబోయాడు. వినలేదు. మండోదరి మధనపడింది. వినలేదు. పంచభూతాలు బిక్కుబిక్కుమన్నాయి. అష్టదిక్పాలకులు చెట్టుకొకరు పుట్టకొకరు పారిపోయారు. మద్యం - మగువల మత్తులో తూలిపోయాడు. చివరకు పోయాడు.

నాకు మంచి తెలుసు - కానీ చేయాలనిపించదు . నాకు చెడు తెలుసు - కానీ చేయకుండా ఉండలేను . స్వభావో దురతిక్రమః - నా స్వభావం ఇంతే . నేను మారను . మారాలని అనుకోవడంలేదు - అన్నాడు రావణుడు.


మనమెలా ఉన్నామో రామాయణం అద్దంలో ఒకసారి చూసుకోవచ్చు . లేదా ప్రతి క్షణం , ప్రతి సందర్భంలో చూసుకోవచ్చు .

arun

arun

Our Contributor help bring you the latest article around you


లైవ్ టీవి

Share it
Top