చంద్రబాబు ఒక్క రోజు హోటల్ ఖర్చు 8.72 లక్షలా? కర్నాటక సీఎం షాక్...

x
Highlights

18గంటల సమయం 8.72లక్షల బిల్లు అంటే గంటకు 50వేలపైనే. ఇది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బెంగళూరులో హోటల్‌ బిల్లు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి చెల్లించనంత బిల్లు...

18గంటల సమయం 8.72లక్షల బిల్లు అంటే గంటకు 50వేలపైనే. ఇది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బెంగళూరులో హోటల్‌ బిల్లు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి చెల్లించనంత బిల్లు ఏపీ సీఎంకు చెల్లించింది కర్ణాటక సర్కార్‌. కుమారస్వామి ప్రమాణస్వీకారం సందర్భంగా అతిథులు బస చేసిన హోటళ్లకు చెల్లించిన బిల్లుల అంశం చర్చనీయాంశంగా మారింది.

కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవం ఖర్చులపై కర్నాటకలో ఇప్పుడు హాట్‌ హాట్‌ చర్చ నడుస్తోంది. అతిథులకు పెట్టిన ఖర్చు చూసి జనం ఔరా అంటున్నారు. కుమారస్వామి ప్రమాణస్వీకారానికి వచ్చిన అతిథులకు కర్నాటక ప్రభుత్వం స్టార్‌ హోటల్స్‌లో బస ఏర్పాటు చేసింది. కర్ణాటక సర్కారే హోటల్‌ బిల్లులను చెల్లించింది. ఇప్పుడు ఈ బిల్లులే కర్ణాటకలో చర్చనీయాంశంగా మారాయ్.

కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవానికి వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు బెంగళూరులోని తాజ్‌వెస్ట్‌లో బస చేశారు. 8గంటలు గడిపితే అక్కడి ప్రభుత్వం 8లక్షల 72వేల రూపాయలు చెల్లించింది. ప్రమాణస్వీకారోత్సవానికి హాజరైన వారందరిలోనూ ఏపీ సీఎం చంద్రబాబు బిల్లే ఎక్కువ. సమాచార హక్కు చట్టం ద్వారా ప్రమాణస్వీకారోత్సవానికి హజరైన అతిథులు బస చేసిన హోటళ్లకు చెల్లించిన ఖర్చులు వెలుగులోకి వచ్చాయి.

సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌, ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎంలు మాయవతి, అఖిలేశ్‌ యాదవ్‌, ఎన్‌సీపీ అధినేత శరద్‌పవార్‌, సీపీఎం నేత సీతారాం ఏచూరి, ఆర్‌జేడీ నేత తేజస్వి యాదవ్‌, ఆర్ఎల్‌డీ నేత అజిత్‌ సింగ్‌ వంటి నేతల కంటే చంద్రబాబు బస చేసిన హోటల్‌కు చెల్లించిన బిల్లే చాలా ఎక్కువ. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఖర్చు లక్షా 85వేలు, మాయవతి బిల్లు లక్షా 40వేలు, పినరయ్ విజయన్ బిల్లు లక్ష, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ బిల్లు లక్షా 2వేలు, ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్, సీతారాం ఏచూరి బిల్లు 64వేల చొప్పున, తేజస్వి యాదవ్‌ బిల్లు లక్షా 2వేల రూపాయలైంది. అతిథులందరు బస చేసిన హోటళ్లకు కర్ణాటక సర్కార్‌ బిల్లులు చెల్లించింది.

చంద్రబాబునాయుడు బెంగళూరు పర్యటన బిల్లులపై అధికార వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు నాయుడు కొన్ని గంటలు మాత్రమే గడిపారని బిల్లుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కర్ణాటక ప్రభుత్వాన్ని కోరారు. సీఎంకు ప్రెసిడెన్షియల్ సూట్, ఇతరులకు కొన్ని రూమ్స్‌ బుక్ చేసినట్లు ప్రొటోకాల్ అధికారి చెబుతున్నారు. సీఎం కొన్ని గంటలు ఉన్నా దాదాపు 9లక్షలు బిల్లు రావడంపై అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ అధికారులు లిఖితపూర్వకంగా కోరితే బిల్లు వ్యవహారంపై విచారణ జరుపుతామని కర్ణాటక ముఖ్య కార్యదర్శి విజయ్ భాస్కర్‌ తెలిపారు.

ప్రమాణస్వీకారోత్సవానికి పార్టీ తరపున అతిథులను పిలిచి ప్రభుత్వ సొమ్మును హోటళ్లకు బిల్లులకు ఎలా చెల్లిస్తారని కర్ణాటక వాసులు మండిపడుతున్నారు. ప్రభుత్వ గెస్ట్‌హౌస్‌లు ఉండగా ప్రైవేట్ హోటళ్లను బుక్‌ చేసి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories