కడప ప్రజలకు తిపీ కబురు చెప్పిన చంద్రబాబు

కడప ప్రజలకు తిపీ కబురు చెప్పిన చంద్రబాబు
x
Highlights

ఈ నెల 27న కడప స్టీల్‌ ప్లాంట్‌కు శంకుస్థాపన చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. కడపలో జరిగిన జ్ఞానభేరి సభలో పాల్గొన్న చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాల...

ఈ నెల 27న కడప స్టీల్‌ ప్లాంట్‌కు శంకుస్థాపన చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. కడపలో జరిగిన జ్ఞానభేరి సభలో పాల్గొన్న చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాల కోసమే కేంద్రంతో పోరాడుతున్నామని స్పష్టం చేశారు. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఐటీ దాడులు చేస్తున్నారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్ట్‌ ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి అని, ఎన్ని ఆటంకాలు ఎదురైనా పోలవరాన్ని పూర్తిచేసి తీరుతామని చంద్రబాబు స్పష్టం చేశారు. విజన్‌ లేకుండా ఏ పనిచేసినా ఫలితాలు రావని అన్నారు. యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఐఏఎస్‌ అవ్వాలనుకున్నానని, ఎమ్మెల్యే అయితే ఎక్కువ మందికి సేవ చేయవచ్చునని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో అభివృద్ధికి మారుపేరుగా ఏపీ ఉంటుందన్నారు. ఏపీని నాలెడ్జ్‌ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. గతంలో పారిశ్రామికీకరణ నెమ్మదిగా ఉండేదని, దూరదృష్టి, భవిష్యత్‌ను చూడగలిగే సామర్థ్యం కావాలని చంద్రబాబు అన్నారు. విద్యుత్ అందుబాటులోకి వచ్చాక పారిశ్రామికీకరణ పుంజుకుందన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories