వైసీపీ ఎత్తులపై లాజిక్ లేవనెత్తిన బాబు

వైసీపీ ఎత్తులపై లాజిక్ లేవనెత్తిన బాబు
x
Highlights

కేంద్రం నుంచి టీడీపీ వైదొలిగిన తర్వాత.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి మార్పు వస్తుందో చెప్పలేకుండా ఉంది. కానీ.. ఇదే సందర్భంలో అధికార టీడీపీ,...

కేంద్రం నుంచి టీడీపీ వైదొలిగిన తర్వాత.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి మార్పు వస్తుందో చెప్పలేకుండా ఉంది. కానీ.. ఇదే సందర్భంలో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ మధ్య రాజకీయం మాత్రం మహా రంజుగా కొనసాగుతోంది. కేంద్రంపై అవిశ్వాసం ఉందంటూనే.. అదే కేంద్రంపై పార్లమెంట్ లో అవిశ్వాసం పెడతామని చెబుతున్న వైసీపీ.. ఇప్పుడు అధికార పార్టీ టార్గెట్ గా మారింది.

నమ్మకం ఉందని చెప్పడం ఏంటి? తర్వాత అవిశ్వాసం పెడతామని అనడం ఏంటి? అంటూ.. ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు లాజిక్ పాయింట్ లేవనెత్తారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై.. పార్టీ ఎంపీలతో టెలి కాన్ఫరెన్స్ చేసిన బాబు.. ఇదే విషయంపై మాట్లాడారు. వైసీపీ సభ్యుల తీరును ఎండగట్టాలని సూచించారు. లాజిక్ ను జనాల్లోకి తీసుకెళ్లాలా చర్యలు ఉండాలని ఉద్బోధించారు.

దీంతో.. ప్రతిపక్ష వైసీపీ నేతలు ఎదురుదాడికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ముందు హోదా కోసం గళం వినిపించి.. తర్వాత కేంద్రం ప్యాకేజీ ఇస్తామంటే సమ్మతించిన టీడీపీ తీరును టార్గెట్ చేయనున్నట్టుగా సమాచారం అందుతోంది. ఎన్నికలకు ముందు.. రాజీనామాలు చేయడం కూడా.. రాజకీయ ప్రయోజనాలకే అన్న వాదన చేసేందుకు కసరత్తు చేస్తోంది. దీంతో.. ముందు ముందు.. టీడీపీ వర్సెస్ వైసీపీ రాజకీయం.. మరింత వేడెక్కడం ఖాయంగా కనిపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories