logo
ఆంధ్రప్రదేశ్

ఏం సంతోషం ఉందని వేడుకలు జరుపుకోవాలి?: చంద్రబాబు

ఏం సంతోషం ఉందని వేడుకలు జరుపుకోవాలి?: చంద్రబాబు
X
Highlights

విభజనతో ఆంధ్రప్రదేశ్ ప్రజలను దారుణంగా అవమానించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలోని...

విభజనతో ఆంధ్రప్రదేశ్ ప్రజలను దారుణంగా అవమానించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలోని బెంజిసర్కిల్‌లో నిర్వహించిన నవనిర్మాణ దీక్షలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు అభద్రతాభావంతో ఉన్నారన్నారు. 2014 బాధా సంవత్సరమని, జూన్ 2 చీకటిరోజని ఆవేదన వ్యక్తం చేశారు. అస్తులు తెలంగాణకు.. అప్పులు ఏపీకి ఇచ్చారన్నారు సీఎం చంద్రబాబు. ఏపీలో తొలి ఏడాది రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉందన్నారు. కష్టాలు, సమస్యలు తప్ప ఏపీకి ఏం ఇచ్చారనిప్రశ్నించారు. కాంగ్రెస్‌ మోసం చేస్తే.. బీజేపీ నమ్మకద్రోహం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం సంతోషం ఉందని వేడుకలు జరుపుకోవాలని చంద్రబాబు ప్రశ్నించారు.

Next Story