మేనల్లుడు ఉదయ్ భౌతికకాయానికి నివాళులర్పించిన సీఎం చంద్రబాబు

మేనల్లుడు ఉదయ్ భౌతికకాయానికి నివాళులర్పించిన సీఎం చంద్రబాబు
x
Highlights

సీఎం చంద్రబాబు మేనల్లుడు కనుమూరి ఉదయ్‌ కుమార్‌(43) శుక్రవారం తెల్లవారుజామున గుండె సంబంధిత వ్యాధితో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మృతి చెందారు....

సీఎం చంద్రబాబు మేనల్లుడు కనుమూరి ఉదయ్‌ కుమార్‌(43) శుక్రవారం తెల్లవారుజామున గుండె సంబంధిత వ్యాధితో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని శుక్రవారం సాయంత్రం స్వగ్రామమైన కందులవారిపల్లెకు తీసుకొచ్చారు. మేనల్లుడు ఉదయ్ కుమార్ భౌతిక కాయానికి సీఎం చంద్రబాబు ఇవాళ నివాళులుర్పించారు. సీఎం చంద్రబాబు తన సోదరితో పాటు కుటుంబ సభ్యులను ఓదార్చారు. నారా భువనేశ్వరి, కొడుకు నారా లోకేష్, కోడలు నారా బ్రాహ్మిణి, మంత్రి అమరనాథ్ రెడ్డి, చిత్తూరు పార్లమెంట్ సభ్యులు ఎన్. శివప్రసాద్, శాసన సభ్యులు సత్యప్రభ, శంకర్ యాదవ్,తలారి ఆదిత్య, కలెక్టర్ ప్రద్యుమ్న, ప్రజాప్రతినిధులు నరసింహ యాదవ్, శ్రీధర్ వర్మ, గాలి భానుప్రకాష్, నాని, సినీ నిర్మాత శేషగిరిరావు, సినీ హీరో నారా రోహిత్, నారా ఇందిర, స్థానికులు, తదితరుల పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories