ధర్మాబాద్ కోర్టుకు వెళ్లకూడదని చంద్రబాబు నిర్ణయం

x
Highlights

బాబ్లీ ప్రాజెక్టు కేసులో ధర్మాబాద్‌ కోర్టుకు హాజరుకారాదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసులో రీకాల్ పిటిషన్ వేయాలని సీఎం...

బాబ్లీ ప్రాజెక్టు కేసులో ధర్మాబాద్‌ కోర్టుకు హాజరుకారాదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసులో రీకాల్ పిటిషన్ వేయాలని సీఎం యోచిస్తున్నారు. ధర్మాబాద్ కోర్టుకి హాజరయ్యే అంశం పై సీఎం చంద్రబాబు మంత్రులు కళా వెంకట్రావు,యనమల, అచ్చెన్నాయుడు, నారాయణ, నక్కా ఆనంద్, అమర్నాథ్ రెడ్డి, ఎంపీ కనకమేడల రవీంద్రబాబుతో పాటు అడ్వకేట్ జనరల్ తో మంతనాలు జరిపారు. బాబ్లీ కేసు కేసు విషయంలో ధర్మాబాద్ కోర్టు జారీ చేసిన నాన్ బెయిల బుల్ అరెస్ట్ వారెంట్ ప్రకారం న్యాయస్థానానికి హాజరు కావాలా లేదా అనే చర్చించారు. అయితే న్యాయమూర్తి ఆదేశించినట్లు ధర్మాబాద్ కోర్టుకు ఈ నెల 15న భారీ ర్యాలీతో హజరయితే బాగుంటుందని కొందరు మంత్రులు చంద్రబాబుకి సూచించారు. చివరికి కోర్టులో రీకాల్ పిటిషన్ వేయాలని నిర్ణయం తీసుకున్నారు.

2010లో బాబ్లీ ప్రాజెక్టు కు వ్యతిరేకంగా జరిగిన పోరాటం కేసులో చంద్రబాబు సహా 16 మందికి ధర్మాబాద్ కోర్టు నాన్‌ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి గత నెలలో చంద్రబాబు తరపున ఎంపీ, న్యాయవాది కనకమేడల రవీంద్రకుమార్ హాజరై వాదనలు వినిపించారు. తమకు నోటీసులు అందలేదని తెలిపారు. కొంత గడువు కోరారు. అయితే సీఎం అయినంత మాత్రాన ప్రత్యేక సౌకర్యాలు కల్పించలేదమని న్యాయస్థానం స్పష్టం చేసింది. సీఎం అయినా, మరెవరైనా కోర్టుకు హాజరుకావాల్సిందేనని స్పష్టం చేస్తూ ధర్మాబాద్ కోర్టు కేసు విచారణను అక్టోబర్ 15కు వాయిదా వేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories