రేపు తెలంగాణాలో చంద్రబాబు ప్రచార షెడ్యూల్ ఇదే..

nanireddy
Updated on: 24 Dec 2018 4:20 PM IST
రేపు తెలంగాణాలో చంద్రబాబు ప్రచార షెడ్యూల్ ఇదే..
X

తెలంగాణలో టీడీపీ అభ్యర్థుల గెలుపుకోసం ఏపీ టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే ఒక దఫా ప్రచారం నిర్వహించారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు. రేపు మరోసారి ఎన్నికల ప్రచారం చేయనున్నారు. రాజేంద్రనగర్, కూకట్‌పల్లి నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తారు. రాజేంద్రనగర్‌లో గణేష్ గుప్తా, కూకట్‌పల్లిలో నందమూరి సుహాసిని పోటీలో ఉన్నారు. ఈ స్థానాల్లో గెలుపును చంద్రబాబు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఉదయం రాజేంద్రనగర్‌లో మధ్యాహం నుంచి రాత్రి వరకూ కూకట్‌పల్లిలో చంద్రబాబు రోడ్‌షోలు ఉంటాయి. మధ్యమధ్యలో ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడతారు. కాగా ఇపప్టికే హైదరాబాద్‌ సిటీలో దాదాపు 50 కి.మీ మేర చంద్రబాబు రోడ్‌ షో సాగింది. దాంతో టీటీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సహం నింపింది.

nanireddy

nanireddy

Next Story