బీజేపీతో జగన్ పొత్తు వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందన

X
Highlights
పొత్తులపై వైసీపీ నేతలకు, బీజేపీ నేతలకు చాలా రోజులుగా చర్చలు జరుగుతున్నాయని చంద్రబాబు చెప్పారు. కేసులను మాఫీ...
arun27 Jan 2018 10:44 AM GMT
పొత్తులపై వైసీపీ నేతలకు, బీజేపీ నేతలకు చాలా రోజులుగా చర్చలు జరుగుతున్నాయని చంద్రబాబు చెప్పారు. కేసులను మాఫీ చేయించుకోవడానికే బీజేపీతో జగన్ దోస్తీ చేస్తున్నారని ఆరోపించారు. జగన్ ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీతో కలిసి పని చేస్తానని కొత్తగా అనడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ ఏ మాట మీదా నిలబడడని, ప్రత్యేక హోదా కోసం ఎంపీలతో రాజీమా చేయిస్తా అన్నాడని.. కానీ చేయించలేదని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇచ్చినపుడు ప్రత్యేక హోదా జగన్‌కు గుర్తుకు రాలేదా అని ఆయన ప్రశ్నించారు. బిహార్, ఒడిషా రాష్ట్రాల్లాగే...అక్రమంగా సంపాదించిన ఆస్తులను స్వాధీనం చేసుకొని అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించాలన్నారు.
Next Story