జోన్‌ మీద రివిజన్‌

జోన్‌ మీద రివిజన్‌
x
Highlights

విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు అంశంపై కేంద్రం ఆలోచన మొదలుపెట్టిందా? దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర ప్రజలు కోరుకుంటున్న డిమాండ్ పట్ల సానుకూలంగా స్పందించే...

విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు అంశంపై కేంద్రం ఆలోచన మొదలుపెట్టిందా? దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర ప్రజలు కోరుకుంటున్న డిమాండ్ పట్ల సానుకూలంగా స్పందించే అవకాశాలు ఏమేరకు వున్నాయి? జోన్ ఏర్పాటుకు వుండే అవకాశలు పరిశీలిస్తే వాల్తేర్ రైల్వే డివిజన్ ఏమీ తక్కువకాదేనే అంశాన్ని ఇప్పుడిప్పుడే కేంద్రం గుర్తించిందా? ఒక వేళ జోనే ఏర్పాటైతే భువనే‌శ్వర్ కేంద్రంగా వున్న తూర్పుకోస్తారైల్వేతో ముడిపడి వుండే అంశాలపై ఆచితూచి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? విశాఖ రైల్వే జోన్‌ని ఏ రకంగా ఏర్పాటు చేస్తే ఆదాయవనరులను నష్టపోకుండా వుంటుంది అనేదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

కేంద్ర బడ్జెట్‌లో విశాఖ రైల్వే జోన్ ప్రస్తావనే లేకపోవడంతో సర్వత్రా నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో కేంద్రం పునరాలోచనలో పడినట్లు తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి. బంగారు గుడ్లు పెట్టే బాతులా దశాబ్దాలుగా ఒకప్పుడు ఆగ్నేయ రైల్వేకు ఆ తర్వాత కాలంలో తూర్పుకోస్తా రైల్వేకు ప్రధాన ఆదాయవనరుగా మారిన వాల్తేర్ రైల్వే డివిజన్ కు ఇప్పుడు ఆ ఫలాలు తమకు ఉపదయోగపడాలన్నదే ఉత్తరాంధ్ర వాసుల ఆకాంక్ష. రాష్ట్ర విభజన జరగడంతో విశాఖ రైల్వేజోన్ అంశం కీలకంగా మారిందనేది నిర్వివాదాంశం.

రైల్వోజోన్ కోసం దశాబ్ధాలుగా చేస్తోన్న పోరాటం ఫలించే రోజులు దగ్గరపడుతోంటే ఉత్తరాంధ్ర ప్రయోజనాలపై ప్రత్యేక దృష్టి సారించాలనేది రాజీకయపక్షాలు చెపుతోన్న మాట. ఒరిస్సాతో జరిగే బేరసారాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్ధితుల్లోనూ అప్రమత్తతతో వ్యవ‍హరించాలంటున్నారు వైసీపీ నేత అమర్. వాల్తేర్ రైల్వే డివిజన్‌కు గుండెకాయిలాంటి కేకే లైన్ వాల్తేర్ డివిజన్ హక్కనే వాదన గట్టిగా వినిపిస్తున్నారు.

ఏపీ ప్రజల్లో మొదలైన వ్యతిరేకతను ఇక కేంద్రానికి ప్రతికూలతగా మారకుండా జాగ్రత్తపడే క్రమంలో ఇప్పుడు రైల్వేజోన్‌పై దృష్టి సారించింది బీజేపీ ప్రభుత్వం. అటు ఒరిస్సాకు, ఇటు ఆంధ్రప్రదేశ్‌కు ఉభయతారకంగా వుండే ఫార్ములాను తెరపైకి తీసుకు వస్తున్నట్లు సమాచారం. వాల్తేర్ రైల్వేడివిజన్ కేంద్రంగా వుండే జోన్ డిమాండ్‌పై ఒరిస్సానుంచి వస్తున్న అభ్యంతరాల మాటెలా వున్నా, రైల్వే జోన్‌పై కేంద్రం కసరత్తు ప్రారంభించిందనే వార్తలతో డివిజన్ల వారీగా ఆదాయ వ్యయాల లెక్కలు తీస్తోంది రైల్వే శాఖ. బీజేపీ నేతలు సైతం ఉత్తరాంధ్రుల ఆకాంక్షను కేంద్రం పరిగణలోకి తీసుకుంటుందనే చెప్పుకొస్తున్నారు.

విశాఖ జోన్‌ ఏర్పాటు సాకారం ఒక ఎత్తైతే.. ఏ పరిధిలో జోన్‌ ఏర్పాటు చేస్తారన్నది మరో కీలక ప్రశ్న. ఇప్పుడు విశాఖ డివిజన్‌లో కీలక ఆదాయాన్ని సమకూరుస్తున్న కిరండోల్‌ లైన్‌ ఒడిశాకి పోతే ఏపీకి తీరని అన్యాయమే జరుగుతుందంటున్నారు నిపుణులు. జోన్‌ సాధనతో పాటు, పరిధి విషయంలో కూడా ఉద్యమకారులు పట్టు విడవకుండా ఉండాలని సూచిస్తున్నారు.

మొత్తానికి అన్ని రకాల ఒత్తిళ్లు పని చేసి ఇన్నాళ్లకు కేంద్ర స్థాయిలో విశాఖ జోన్‌ విషయంలో కదలిక వచ్చింది. ఇందులో భాగంగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం భూభాగాన్ని ఏపీ జోన్‌లోనే ఉంచాలన్నదానిపై కేంద్ర ప్రభుత్వ స్థాయివర్గాలు ఒడిశాతో చర్చిస్తున్నాయి. ఏపీ భూ భాగం ప్రకారం ఉత్తరాంధ్రా జిల్లాలు విశాఖ రైల్వే జోన్‌లోనే వుంచాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

విశాఖ నగర పరిధిలో రైల్వే ఇంజిన్లకు వనరైన డీజిల్‌ లోకోషెడ్‌, ఎలక్ట్రికల్‌ లోకోషెడ్‌ ఉన్నాయి. అంటే.. జోన్‌ పరిధిలో ఎలాంటి అవసరాలనైనా ఇవి తీర్చగలిగే సామర్థ్యం ఉంది. వడ్లపూడిలో వ్యాగన్‌వర్క్‌షాప్‌ రాబోతోంది. దీంతో అటు రైళ్ల మరమ్మతులు, ఇటు ఇంజిన్‌ల మరమ్మతులు విభాగాలు విశాఖ లోనే వున్నాయి. జోన్‌ వచ్చిన తర్వాత మరిన్ని సౌకర్యాలు పెంచుకునే అవకాశముంటుంది. వాల్తేర్ డివిజన్ కేంద్రంగా చేసుకుని గుంతకల్లు, విజయవాడ, గుంటూరు కలిపి జోన్ ఏర్పాటు చేసే అంశంపై రాజకీయ ఒత్తడి పెరగాలంటున్నారు

కేకేలైన్‌ పొడవు 473 కిలోమీటర్లు. ఇందులో అరకు దాటిన తర్వాత 6 కిలోమీటర్ల దూరంలో గోరాపూట్‌ అనే ఊరుంది. ఇక్కడి వరకూ ఏపీ పరిధి. అంటే.. 126 కిలోమీటర్లు ఏపీ పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం వాల్తేరుకు ఆదాయం తెచ్చిపెడుతున్న సరుకు రవాణాలో కీలకం ఛత్తీస్‌గడ్‌లోని బైలడిల్ల ఐరన్‌ఓర్‌ గనులు. ప్రస్తుతం ఇది వాల్తేరు డివిజన్‌లోనే ఉంది. కోరాపూట్‌లోని మాంగనీస్‌ గనులు కూడా ఈ డివిజన్‌ పరిధిలో ఉన్నాయి. విభజనలో ఇవి ఎటువైపు వెళ్తాయన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories