బ్రేకింగ్‌ : కొత్త జోన్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం

బ్రేకింగ్‌ : కొత్త జోన్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం
x
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి ఫలించింది. రాష్ట్రంలో కొత్త జోన్ల ఏర్పాటుకు రాష్ట్రపతి అమోదం తెలిపారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌...

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి ఫలించింది. రాష్ట్రంలో కొత్త జోన్ల ఏర్పాటుకు రాష్ట్రపతి అమోదం తెలిపారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో కొత్తగా 7 జోన్లు, 2 మల్టీజోన్లు ఏర్పాడ్డాయి.

ప్రతిపాదిత 7 జోన్లు ఇవీ...

కాళేశ్వరం జోన్‌..
జిల్లాలు: భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి, జనాభా: 28.29 లక్షలు.
బాసర జోన్‌...
జిల్లాలు: ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, జనాభా: 39.74 లక్షలు.
రాజన్న జోన్‌...
జిల్లాలు: కరీంనగర్, సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, జనాభా: 43.09 లక్షలు.
భద్రాద్రి జోన్‌...
జిల్లాలు: వరంగల్‌ రూరల్, వరంగల్‌ అర్బన్, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, జనాభా: 50.44 లక్షలు
యాదాద్రి జోన్‌...
జిల్లాలు: సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, జనగామ, జనాభా: 45.23 లక్షలు
చార్మినార్‌ జోన్‌...
జిల్లాలు: హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, జనాభా: 1.03 కోట్లు
జోగుళాంబ జోన్‌...
జిల్లాలు: మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల, నాగర్‌ కర్నూల్, వికారాబాద్, జనాభా: 44.63 లక్షలు.

మల్టీజోన్ల పరిధిలోకి వచ్చే జోన్లు...
1. కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రి
2. యాదాద్రి, చార్మినార్, జోగుళాంబ.

Show Full Article
Print Article
Next Story
More Stories