డుబుల్‌కు కేంద్రం షాక్‌

డుబుల్‌కు కేంద్రం షాక్‌
x
Highlights

తెలంగాణ ప్రభుత్వానికి మోడీ సర్కార్ ఊహించని షాక్ ఇచ్చింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కోసం కేటాయించిన 190 కోట్లకు పైగా నిధులను తిరిగి ఇచ్చేయాలని కోరింది....

తెలంగాణ ప్రభుత్వానికి మోడీ సర్కార్ ఊహించని షాక్ ఇచ్చింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కోసం కేటాయించిన 190 కోట్లకు పైగా నిధులను తిరిగి ఇచ్చేయాలని కోరింది. నిధులు విడుదలై రెండేళ్లయినా ఒక్క ఇంటినీ నిర్మించకపోవడంతో డబ్బు వాపస్ చేయాలని కేంద్రం ఆదేశించింది.

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణకు ఇచ్చిన నిధుల విషయంలో కేంద్రం ఊహించని నిర్ణయం తీసుకుంది. 70, 674 ఇళ్ల నిర్మాణం కోసం విడుదల చేసిన 190.78 కోట్ల రూపాయల నిధులను తిరిగి ఇచ్చేయలని కోరింది. 190.78 కోట్ల నిధుల్లో ఒక్క పైసా కూడా ఖర్చు చేయకపోవడమే కేంద్రం నిర్ణయానికి కారణం. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కోసం 2016-17 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్రం తెలంగాణకు 190.78 కోట్ల రూపాయల్ని కేటాయించగా ఇంత వరకు ఒక్క ఇంటిని కూడా నిర్మించలేదు. దీంతో ఖర్చు చేయని డబ్బును వెనక్కి ఇచ్చేయాలని కేంద్రం కోరింది.

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అమలు పురోగతిపై కేంద్రం ఇటీవల సమీక్ష నిర్వహించింది. ఇళ్ళ నిర్మాణం గురించి తెలంగాణ ప్రభుత్వం సమాచారం ఇవ్వకపోవడంతో పాటు ఆవాస్ వెబ్ పోర్టల్‌ను అప్ డేట్ చేయకపోవడంపై చర్చ జరిగింది. అలాగే రెండో విడత నిధులను ఇంత వరకు అడగకపోవడం గురించీ చర్చించారు. తెలంగాణ ప్రభత్వం డబుల్ బెడ్రూం ఇళ్ళ పథకం అమలు చేస్తున్న నేపథ్యంలోనే ప్రధాన మంత్రి ఆవాస్ యోజనను అమలు చేయడం లేదనే నిర్ణయానికి వచ్చారు. దీంతో కేంద్రం విడుదల చేసిన 190.78 కోట్ల రూపాయల నిధులను వాపస్ ఇచ్చేయలని కోరారు. అంతేకాదు తెలంగాణ ప్రభుత్వం తిరిగి ఇచ్చే నిధులను ఇతర రాష్ట్రాలకు కేటాయించాలని కేంద్రం నిర్ణయించింది.

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన నిధులను నిరుపయోగంగా మార్చడంపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌ చేతగానితనం వల్లే కేంద్ర నిధులు వినియోగానికి నోచుకోలేకపోతున్నాయని కృష్ణ సాగర రావు మండిపడ్డారు. ఒక్క తెలంగాణలో తప్ప ఇతర రాష్ట్రాల్లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన చక్కగా అమలౌతోందని బీజేపీ నేతలు అంటున్నారు. 2018-19 సంవత్సరానికి కోటి ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకోగా ప్రస్తుతం 52 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతోందని చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories