logo
ఆంధ్రప్రదేశ్

తెలుగు రాష్ట్రాల్లో శాసనమండలి ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

తెలుగు రాష్ట్రాల్లో శాసనమండలి ఎన్నికల షెడ్యూల్‌ విడుదల
X
Highlights

తెలుగు రాష్ట్రాల్లో శాసనమండలి ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. తెలంగాణలో 3, ఆంధ్రప్రదేశ్‌లో 3 స్థానాలకు ఎన్నికలు...

తెలుగు రాష్ట్రాల్లో శాసనమండలి ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. తెలంగాణలో 3, ఆంధ్రప్రదేశ్‌లో 3 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 2019 మార్చి 29తో ఆరుగురు ఎమ్మెల్సీల పదవీ కాలం పూర్తికానుంది.

ఏపీలో ఖాళీ కానున్న మూడు ఎమ్మెల్సీ స్థానాలు.
1. ఉభయగోదావరి జిల్లాలు (పట్టభద్రులు) - కలిదిండి రవికిరణ్‌ వర్మ
2. కృష్ణా, గుంటూరు (పట్టభద్రులు ) - బొద్దు నాగేశ్వరరావు
3. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం (ఉపాధ్యాయులు) - గాదె శ్రీనివాసులు
తెలంగాణలో ఖాళీ కానున్న మూడు ఎమ్మెల్సీ స్థానాలు:
1. మెదక్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ (పట్టభద్రులు) - స్వామిగౌడ్‌
2. వరంగల్‌, ఖమ్మం, నల్గొండ (ఉపాధ్యాయులు) - పూల రవీందర్‌
3. మెదక్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్ (ఉపాధ్యాయులు) ‌- పాతూరి సుధాకర్‌ రెడ్డి

ఈ మొత్తం ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ రంగం సిద్ధం చేస్తోంది. దీంతో ఎన్నికల కోసం ఓటర్ల జాబితా తయారీకి షెడ్యూల్‌ ప్రకటించింది. ఓటర్ల జాబితా కోసం అక్టోబరు 1న ప్రకటన విడుదల చేయనుంది. నవంబరు 6వరకు ఓటు హక్కు కోసం దరఖాస్తుకు అవకాశం కల్పించారు. 2019 జనవరి 1న ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల చేయనున్నారు. జనవరి నెలాఖరు వరకు అభ్యంతరాలు, వినతులకు అవకాశం కల్పించారు. 2019 ఫిబ్రవరి 20న ఓటర్ల తుది జాబితా ప్రకటించనున్నారు.

Next Story