అందరూ ఎంపీలు ఎందుకు రాజీనామా చేయలేదు : చంద్రబాబు

x
Highlights

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వైసీపీపై మరోసారి ఫైరయ్యారు. వైసీపీకి చెందిన ఎంపీలందరూ ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. ఎంపీలంటే అందరూ ఒకటేనని ఐదుగురు...

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వైసీపీపై మరోసారి ఫైరయ్యారు. వైసీపీకి చెందిన ఎంపీలందరూ ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. ఎంపీలంటే అందరూ ఒకటేనని ఐదుగురు మాత్రమే ఎందుకు రాజీనామా చేశారని అన్నారు. రాయబారాలు నడిపేందుకు రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేయలేదా ? అంటూ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం నమ్మకం ద్రోహం చేసిందన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. చివరి బడ్జెట్‌లో కూడా అన్యాయం చేసినందునే తమ పార్టీ కేంద్ర ప్రభుత్వం నుంచి వైదొలగిందన్నారు. విభజన హామీలు అమలు చేయాలంటూ అసెంబ్లీలో చంద్రబాబు తీర్మానం ప్రవేశపెట్టారు. అండగా ఉంటామన్న కేంద్రం...నాలుగేళ్లయినా పట్టించుకోలేదని స్పష్టం చేశారు. పార్లమెంట్‌ను ప్రత్యేకంగా సమావేశపరిచి విభజన హామీలపై చర్చించాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. ఢిల్లీలో టీడీపీ ఎంపీలు న్యాయం చేయాలని పోరాటం చేస్తుంటే ఎదురుదాడికి దిగుతున్నారని మండిపడ్డారు. కుట్ర రాజకీయాలకు అడ్డుకట్ట వేయాలనే న్డీఎ నుంచి బయటకు వచ్చామని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories