పోలవరం ప్రాజెక్టుకు ప్రతిష్టాత్మక అవార్డు..

nanireddy
Updated on: 24 Dec 2018 4:42 PM IST
పోలవరం ప్రాజెక్టుకు ప్రతిష్టాత్మక అవార్డు..
X

ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు ప్రతిష్టాత్మకమైన CBIP అవార్డు దక్కింది. ఈ అవార్డు రావటం పట్ల ఏపీ సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ అవార్డు.. ప్రాజెక్టుపై కొందరు విషం కక్కుతున్న వారికి తిరుగులేని సమాధానం అని అన్నారు. పోలవరం విషయంలో విమర్శించేవారికి తమ పనితీరుతోనే సమాధానం ఇస్తామన్నారు. ఈ దేశంలోనే పోలవరం సాగునీటిప్రాజెస్ట్ అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ గా అభివర్ణించారు. కాంక్రీట్ పనుల్లో అంతర్జాతీయ రికార్డులు సాధిస్తున్నామన్న చంద్రబాబు.. ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామ్యులైన అందరికీ అభినందనలు తెలిపారు. ఎప్పటికైనా పోలవరం పూర్తిచేసేది తామేనని.. సాగునీటి ప్రాజెక్టులు అన్ని పూర్తిచేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.

nanireddy

nanireddy

Next Story