అయేషా మీరా హత్య కేసులో విచారణ ప్రారంభించిన సీబీఐ

అయేషా మీరా హత్య కేసులో విచారణ ప్రారంభించిన సీబీఐ
x
Highlights

అయేషా మీరా హత్య కేసులో సీబీఐ విచారణ ప్రారంభించింది. కేసు విచారించాలంటూ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలతో రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు కాసేపట్లో విజయవాడ...

అయేషా మీరా హత్య కేసులో సీబీఐ విచారణ ప్రారంభించింది. కేసు విచారించాలంటూ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలతో రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు కాసేపట్లో విజయవాడ చేరుకోనున్నారు. ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు ఫైళ్లు స్వాధీనం చేసుకున్న అధికారులు విజయవాడ కోర్టులో దగ్ధమైన రికార్డుల గురించి దర్యాప్తు చేయనున్నారు. 2007, డిసెంబర్‌ 27న విజయవాడలోని ఓ హాస్టల్ లో ఆయేషా మీరాను గుర్తుతెలియని దుండగుడు అత్యాచారం చేసి కిరాతకంగా హత్యచేశాడు. ఈ కేసులో 2008లో సత్యం బాబు అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేయగా, దిగువకోర్టు అతనికి యావజ్జీవశిక్ష విధించింది. కానీ 2017, మార్చి 31న హైకోర్టు సత్యంబాబును నిర్దోషిగా ప్రకటించింది. దీంతో కేసు మొత్తం మళ్లీ మొదటికి వచ్చింది. ఈ ఘటనలో దోషులను పట్టుకోవడంలో ఏపీ పోలీసులు విఫలం కావడంతో ఏపీ ప్రభుత్వం సిట్ ను నియమించింది. తాజాగా ఈ కేసుకు సంబంధించి విజయవాడ కోర్టులో ఉన్న సాక్ష్యాలు, రికార్డులు ధ్వంసం అయ్యాయని సిట్ చెప్పడంతో ఈ వ్యవహారంపై హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories