త్వరలో ఏపీలో మరో కొత్త పార్టీ... ఈ నెల 26న...

త్వరలో ఏపీలో మరో కొత్త పార్టీ... ఈ నెల 26న...
x
Highlights

ఏపీలో మరో కొత్త పార్టీ ఆవిర్భవించబోతోంది. సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ కొత్త పార్టీ పెట్టాలని నిర్ణయించారు. ఈ నెల 26న ఆయన అధికారికంగా...

ఏపీలో మరో కొత్త పార్టీ ఆవిర్భవించబోతోంది. సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ కొత్త పార్టీ పెట్టాలని నిర్ణయించారు. ఈ నెల 26న ఆయన అధికారికంగా ప్రకటించబోతున్నారు. విజయవాడ కేంద్రంగా ఏర్పాటు కానున్న కొత్త పార్టీ జెండా, ఎజెండాను ఆయన అదే రోజు ప్రకటించనున్నారు. గత కొద్ది కాలంగా లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి వస్తున్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఆయన బీజేపీలో చేరతారని, వైసీపీ, టీడీపీ, జనసేనలు కూడా తమతో కలిసి పనిచేయాలని కోరినట్టు ప్రచారం జరిగింది. ఈ ఊహాగానాలకు ఆయన పుల్‌స్టాప్ పెడుతూ, సొంతంగానే పార్టీ ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. కడప జిల్లాకు చెందిన లక్ష్మీనారాయణ 1990 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి. సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా జగన్ అక్రమాస్తుల కేసును అప్పట్లో పరుగులు పెట్టించారు. అనంతరం, ఆయన మహారాష్ట్రకు బదిలీ కావడంతో కొద్ది రోజలు దీర్ఘకాలిక సెలవు తీసుకుని, తర్వాత స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories