టీఆర్ఎస్‌లో స్టార్ క్యాంపెయిన‌ర్స్...40 మందిని ప్ర‌చారంలోకి దింపిన గులాబి బాస్ కేసీఆర్

టీఆర్ఎస్‌లో స్టార్ క్యాంపెయిన‌ర్స్...40 మందిని ప్ర‌చారంలోకి దింపిన గులాబి బాస్ కేసీఆర్
x
Highlights

టీఆర్ఎస్‌లో స్టార్ క్యాంపెయిన‌ర్స్ కేసీఆరే అని అంద‌రు భావించారు. కాని మ‌రో 40మంది కూడా రంగంలోకి దిగారు. వాళ్లు స్టార్ క్యాంపెయిన‌ర్స్ కాదు...

టీఆర్ఎస్‌లో స్టార్ క్యాంపెయిన‌ర్స్ కేసీఆరే అని అంద‌రు భావించారు. కాని మ‌రో 40మంది కూడా రంగంలోకి దిగారు. వాళ్లు స్టార్ క్యాంపెయిన‌ర్స్ కాదు కేటీఆర్,హ‌రిష్ ,క‌విత‌లు అంత క‌న్నా కానే కాదు. మ‌రి ఎవ‌రా స్టార్ క్యాంపెయిన‌ర్స్ అనుకుంటున్నారా.?

ఎన్నిక‌ల్లో 100 సీట్లు గెలుపే ల‌క్ష్యంగా గులాబీ అధినేత కేసీఆర్ స‌రికొత్త వ్యూహాల‌ను ర‌చిస్తున్నారు. ఇందులో బాగంగా కులాల వారిగా ఓటు బ్యాంకును టీఆర్ఎస్ వైపు మ‌ల్లించేందుకు పార్టీలో ఉన్న కుల‌ పెద్ద‌ల‌నే నేరుగా ఎన్నిక‌ల్లో రంగంలోకి దింపుతున్నారు. నాలుగ‌న్న‌ర ఏళ్ల‌లో ప్ర‌భుత్వం అమ‌లు చేసిన ప‌థ‌కాలు కులాల వారిగా చేకూరిన ల‌బ్ది ప‌లు అంశాల‌ను నేరుగా కుల సంఘాల‌తో టీఆర్‌ఎస్‌లోని కుల పెద్ద‌ల‌తోనే చెప్పిస్తున్నారు.

టీఆర్ఎస్ లో కుల‌సంఘాల వారిగా ప్ర‌చారం నిర్వ‌హించేందుకు దాదాపు 40 మంది కీల‌క నేత‌ల‌కు అధినేత కేసీఆర్ భాద్య‌త‌లు అప్ప‌గించారు. ఈ ఎన్నిక‌ల్లో ప్రధానంగా బీసిలు,ఎస్సీలు,ఎస్టీల‌,మైనార్టీల ఓటు బ్యాంకే కీల‌కం కావ‌డంతో క్యాష్ట్ క్యాంపేన‌ర్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విసృత ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గాల వారిగా అత్య‌దిక జ‌నాభా ఉన్న కుల‌సంఘాల‌తో ప్ర‌త్యేకంగా స‌మావేశం నిర్వ‌హించ‌డం . మ‌న కుల‌పోళ్లంతా ప్ర‌భుత్వ పథ‌కాల‌తో ల‌బ్ది పొందాం కాబ‌ట్టి టీఆర్ఎస్ కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని భ‌విష్య‌త్ లో మ‌రిన్ని ప‌థ‌కాలు ఆశించే రీతిలో మ‌నం ఉండాల‌న్న తీర్మానాలు క్యాస్ట్ క్యాంపెయిన‌ర్స్ ఆధ్వర్యంలో జ‌రుగుతున్నాయి.

జ‌నాభా ప్ర‌తిపాదిక‌న బీసిలు అత్య‌ధికంగా ఉండ‌టంతో పార్టీలో ఉన్న బీసి నేత‌ల‌కు కీల‌క బాద్య‌త‌లు అప్ప‌గించారు కేసీఆర్. గొల్ల‌కురుమ‌ల‌కు గొర్రెలు, బ‌ర్రెలు ఇవ్వ‌డంతో ఆ స‌మాజిక ఓటు బ్యాంకు టీఆర్ఎస్‌కే ప‌డేలా ప్ర‌చారం సాగుతోంది. ఈ మ‌ధ్య ఆర్మూర్, బాల్కొండ నియోజ‌క‌వ‌ర్గాల్లో బహిరంగ స‌భ‌ల‌కు బీసి మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ ప‌ర్య‌ట‌న‌కు అధిష్టానం ఏకంగా స్పెష‌ల్ చాప‌ర్ నే ఏర్పాటు చేసింది. ప్ర‌చారానికి కావాల్సిన స‌క‌ల స‌దుపాయాల‌ను ఏర్పాటు చేసింది. ముదిరాజ్‌ల‌కు చేప‌పిల్ల‌ల‌ను ఉచితంగా ఇవ్వ‌డంతో ఆ సామాజిక వ‌ర్గ ఓట్ల‌న్నిగంప‌గుత్త‌గా టీఆర్ఎస్ ఖాతాలో ప‌డే విధంగా త‌ల‌సాని ప్ర‌చారం చేస్తున్నారు. ఇదే స్థాయిలో మిగ‌తా బీసి సామాజిక వ‌ర్గానికి సంబందించిన కీల‌క నేత‌లు సైతం రంగంలోకి దిగాల‌ని కేసీఆర్ సూచించారు.

క‌ల్లుగీత కార్మికుల‌కు చేకూరిన ల‌బ్ధి విష‌యంలో ఆప‌ధ్ద‌ర్మ మంత్రి ప‌ద్మారావుని అధిష్టానం రంగంలోకి దింపింది. గౌడ సామాజిక వ‌ర్గ ఓట్ల‌న్ని టీఆర్ఎస్ కు ప‌డేలా ప‌ద్మారావును ప్ర‌చారం చెయ్యాల‌ని కేసీఆర్ కోరారు. మ‌రోవైపు ఎంబిసి చైర్మన్ తాడురి శ్రీనివాస్ కు సైతం నాయి బ్రాహ్మన్లు,క‌మ్మ‌రి,కుమ్మ‌రి, సామాజికి వ‌ర్గానికి సంబందించిన ఎంబిసి కులాల ఓట్ల‌ను టీఆర్ఎస్కు మ‌ల్లించేందుకు ప్ర‌చారం చెయ్యాల‌ని ఇప్ప‌టికే ఆదేశించారు. ఆ దిశ‌గానే తాడురి ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ఇక ఎస్టీ ల ఓటు బ్యాంకు విష‌యంలో కేసీఆర్ ప్ర‌త్యేక శ్ర‌ద్ద తీసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత 2014 మ్యానెఫెస్ట్లో లో ఇచ్చిన హామి మేర‌కు తండాల‌ను గ్రామ‌పంచాయితిలుగా మార్చామ‌ని ఆ క్రెడిట్ వేరే పార్టీల‌కు పోకుండా ఎస్టీ ఓట్ల‌న్ని టీఆర్ఎస్ కు ద‌క్కేలా నియోజ‌క‌వ‌ర్గాల్లో నేత‌లు ప్రచారం చేస్తున్నారు. మంత్రి చందూలాల్తో స‌హా కొంత‌మంది ఎస్టీ సామాజిక వ‌ర్గానికి సంబందించిన సీనియ‌ర్ నేత‌లంతా కూడ ఈ దిశ‌గానే ప్ర‌చారం సాగిస్తున్నారు.

ఇక ఎస్సీల విష‌యంలో ద‌ళితుల‌కు మూడెక‌రాల భూమి లాంటి స్కీం ల‌ను గ్రౌండ్ లెవ‌ల్లో బాగా తీసుకు వెళ్లాల‌ని కొంత స‌మ‌యం ఆల‌స్యం అయినా భూమి కొని ఇచ్చేందుకు ప్ర‌భుత్వం సిద్దంగా ఉందనే మెసేజ్‌ను తీసుకెల్లాల‌ని ఎస్సీ నేత‌ల‌కు కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. ఇళ్లు లేని నిరుపేద‌ల‌కు డ‌బుల్ బెడ్ రూం ఇళ్ల‌ను ఇచ్చామ‌ని ఈ మెసేజ్‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేందుకు ఉప‌ముఖ్య‌మంత్రి కడియంకు ప్ర‌చార క‌ర్త‌గా భాద్య‌త‌లు అప్ప‌గించారు. ఆ దిశ‌గానే క‌డియం అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎస్పీల ఓటు బ్యాంకు కీల‌కంగా ప్ర‌చారాన్ని నిర్వ‌హిస్తున్నారు. వాస్త‌వానికి స్టార్ క్యాంపేన‌ర్ కేసీఆరే అని అనుకున్నా ఆయా సామాజికి వ‌ర్గాల ఓట్ల‌ను కొల్ల‌గొట్టేందుకు 40మంది క్యాష్ట్ క్యాంపేన‌ర్ల‌ను రంగంలోకి దింప‌డంతో గులాబి పార్టీ ప్ర‌చారం మ‌రింత జోష్ గా సాగుతుంది. అయితే అధినేత స‌రికొత్త వ్యూహం ఫలిస్తుందా లేక బెడిసికొడుతుందా అనేది ఎదురుచూడాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories