భూ వివాదం.. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేపై కేసు

భూ వివాదం.. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేపై కేసు
x
Highlights

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్ పై మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ లో మరోసారి ట్రెస్ పాస్ కింద కేసు నమోదు. రాజేంద్రనగర్...

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్ పై మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ లో మరోసారి ట్రెస్ పాస్ కింద కేసు నమోదు. రాజేంద్రనగర్ సర్కిల్ బాబుల్ రెడ్డి నగర్ కాలనీకి చెందిన ఆవుల శ్రీనివాస్ అనేవ్యక్తి బాబుల్ రెడ్డి నగర్ లోని తన భూమిని కబ్జా చేశారంటూ మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు దర్యాప్తు చేసిన మైలార్ దేవుపల్లి పోలీసులు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పై సెక్షన్ 447, 427, 506 కింద కేసు నమోదు చేశారు. ఈయనపై గతంలోనూ దుర్గానగర్ సమీపంలోని తనభూమిలో కూడా అధికారులతో వచ్చి నిర్మాణాలు కూల్చి వేయించాడంటూ మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ లో బాధితుడు ఫిర్యాదు చేశారు. అప్పట్లో ఎమ్మెల్యేపై సెక్షన్ 447, 427, 506 కింద కేసు నమోదు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories