యాంకర్‌ రవిపై కేసు నమోదు..అంతుచూస్తానంటూ..

nanireddy
Updated on: 24 Dec 2018 3:41 PM IST
యాంకర్‌ రవిపై కేసు నమోదు..అంతుచూస్తానంటూ..
X

టీవీ యాంకర్‌, ప్రముఖ నటుడు రవి దాడికి పాల్పడ్డాడంటూ ఓ సినీ డిస్ట్రిబ్యూటర్‌ పోలీసులను ఆశ్రయించారు. తనబాకీ తీర్చాలంటూ యాంకర్‌ రవి తన అనుచరులతో వచ్చి బెదిరింపులకు దిగుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు సదరు డిస్ట్రిబ్యూటర్. కొంతకాలంగా డిస్ట్రిబ్యూటర్‌ సందీప్‌తో రవికి ఆర్థికపరమైన లావాదేవీలు ఉన్నట్టు తెలుస్తోంది. తీసుకున్న బాకీని సందీప్‌ చెల్లించకపోవడంతో రవి కోపోద్రిక్తుడయ్యాడు. అప్పు తీర్చకుంటే అంతుచూస్తానంటూ తన అనుచరులతో వచ్చి బెదిరించాడని సందీప్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా యాంకర్ రవిని విచారించారు. మరోసారి మళ్లీవిచారణక పిలుస్తామని రవికి పోలీసులు చెప్పినట్టు సమాచారం.

nanireddy

nanireddy

Next Story