ఎమ్మెల్యే రవీందర్ రెడ్డిపై కేసు నమోదు

ఎమ్మెల్యే రవీందర్ రెడ్డిపై కేసు నమోదు
x
Highlights

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి తాజా మాజీ ఎమ్మెల్యే, టీఆర్ ఎస్ నేత ఏనుగు రవీందర్ పై 171 బి కింద అధికారులు కేసు నమోదు చేశారు. ఎన్నికల ప్రచారంలో మహిళా...

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి తాజా మాజీ ఎమ్మెల్యే, టీఆర్ ఎస్ నేత ఏనుగు రవీందర్ పై 171 బి కింద అధికారులు కేసు నమోదు చేశారు. ఎన్నికల ప్రచారంలో మహిళా సంఘాలకు ప్రలోభ పెట్టేలా మాట్లాడారని విచారణలో తేలింది. ఇందుకు సంబంధించిన రిపోర్ట్ ను ఎన్నికల సంఘానికి పంపినట్లు కామారెడ్డి జిల్లా కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మర్కల్ గ్రామంలో ఓట్ల కోసం మహిళా సంఘాలను ప్రలోభాలకు గురి చేసేలా ఆయన మాట్లాడారని ప్రతిపక్షాలు ఎలక్షన్‌ కమిషన్‌ను ఆశ్రయించాయి. ప్రతిపక్షాల ఫిర్యాదు మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ రంగంలోకి దిగింది. కామారెడ్డి కలెక్టర్‌ సత్యనారాయణ ఈ తతంగంపై విచారణ జరిపారు. ప్రతిపక్షాలు సమర్పించిన వీడియో పుటేజీలను కూడా ఈసీ నిశితంగా పరిశీలించింది ఈసీ ఆదేశాల మేరకు కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories