పోలీసులకు షాకిచ్చిన బాబు గోగినేని

పోలీసులకు షాకిచ్చిన బాబు గోగినేని
x
Highlights

హిందువుల మనోభావాలు దెబ్బతినేలా సోషల్ మీడియాలోను .. టీవీ చానళ్లలోను బాబు గోగినేని విమర్శలు చేస్తున్నారనీ, నిబంధనలకు విరుద్ధంగా ఆధార్ కార్డు నెంబర్లను...

హిందువుల మనోభావాలు దెబ్బతినేలా సోషల్ మీడియాలోను .. టీవీ చానళ్లలోను బాబు గోగినేని విమర్శలు చేస్తున్నారనీ, నిబంధనలకు విరుద్ధంగా ఆధార్ కార్డు నెంబర్లను సేకరిస్తున్నారని మాదాపూర్ పోలీస్ స్టేషన్లో క్రితం నెల 26వ తేదీన వీరనారాయణ ఫిర్యాదు చేశారు. దాంతో బాబు గోగినేనిపై దేశద్రోహం .. ఆధార్ చట్టంతో పాటు పలు సెక్షన్లపై కేసు నమోదు చేశారు. కోర్టు ఆదేశాల ప్రకారం మాదాపూర్‌ పోలీసులు బాబుగోగినేనిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదుచేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. అయితే కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు బాబు గోగినేని న్యాయవాదులు షాక్ ఇచ్చారు. ప్రస్తుతం బిగ్ బాస్ 2 షోలో కొనసాగుతున్న బాబు గోగినేనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వీరనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. గోగినేని న్యాయవాదలు వీరనారయణవేసిన పిల్‌కు కౌంటర్ దాఖలు చేయడంతో... బాబు గోగినేనికి కోర్టులో ఊరట లభించింది. ఈ కేసుపై తదుపరి దర్యాప్తు 2 నెలల పాటు నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories