సీఎం కారు నెంబర్‌నే వాడేసిన కేటుగాళ్లు

x
Highlights

చలాన్లు ను తప్పించుకోవాడానికి ఏకంగా సీఎం ఉపయోగించే నెంబర్‌నే ఉపయోగిస్తున్నారు కొంత మంది కేటుగాళ్ళు .. ముఖ్యమంత్రి కాన్వాయ్‌ కి ఉన్న కారు నెంబర్ల ను తన...

చలాన్లు ను తప్పించుకోవాడానికి ఏకంగా సీఎం ఉపయోగించే నెంబర్‌నే ఉపయోగిస్తున్నారు కొంత మంది కేటుగాళ్ళు .. ముఖ్యమంత్రి కాన్వాయ్‌ కి ఉన్న కారు నెంబర్ల ను తన కార్లు కి పెట్టుకొని దర్జాగా తిరిగేస్తున్నారు .. మితిమీరిన వేగం తో డ్రైవ్ చేస్తూ అడ్డంగా సీసీ కెమెరాలు కి చిక్కారు. ఇంటిగ్రేటెడ్ ఈ చలాన్ సిస్టం ద్వారా కేటుగాళ్ళు లీలలు బట్టబయలయ్యాయి.

నిబంధనలు తుంగలో తొక్కి ఏకంగా ముఖ్యమంత్రి కాన్వాయ్ కారు నెంబర్లనే తన కార్లు కి ఉపయోగించుకుంటున్నారు కొంత మంది కేటుగాళ్ళు. సాదారణంగా సీఎం కాన్వాయ్ లో ఆరు కారులు ఉంటాయి.కాన్వాయ్ లోని కారులు అన్నిటికి ఒకే నెంబర్ ఉంటుంది. కేసీఆర్‌ కాన్వాయ్‌ కార్ల కు నంబర్‌ TS09K6666 ఉంటుంది. అయితే అదే నంబరుతో తిరుగుతున్న మరో ఏడు కార్లును పోలీసులు గుర్తించారు. మితిమీరిన వేగం తో నగరంలో ఏడూ కార్లు కొంత కాలంగా తిరుగుతున్నా పోలీసులు వాటిని గుర్తించలేక పోయారు. ఎట్టకేలకు కేటుగాళ్లు చేస్తున్న మాయని గుర్తించారు.

TS09K6666 ఈ నెంబర్ చెపితే చాలు ముఖ్యమంత్రి కారు నెంబర్ అంటూ గుర్తుపడుతారు ... కాని అదే నెంబర్‌ను కొంత మంది కేటుగాళ్ళు తమ స్వార్ధానికి ఉపయోగించుకుంటున్నారు. చలాన్లను తప్పించుకోవడం కోసం ఇలా నకిలీ నెంబర్ ప్లేట్ లు తగిలించుకొని తిరుగుతున్నారు. 2015 నుంచి ఇప్పటి దాకా ఇలా సీఎం కారు నంబర్‌తో నకిలీ ప్లేట్లను బిగించుకున్న ఏడు వాహనాలు హైదారాబాద్ లో తిరుగుతున్నాయి .. అయితే ఇలా నకిలీ నెంబర్ ప్లేట్లు తో తిరుగుతున్న ఏడూ వాహనలు కి నిబంధనలు ఉల్లంఘించిన ప్రతి సారి చలానాలు వేశారు అధికారులు.

గతం లో రోడ్లుపై వాహనాలు ఆపి మరి చెకింగ్ లు చేసేవారు .. నిబంధనలను ఉల్లంఘించేవారిని ఆపి, ఆర్‌సీ, లైసెన్స్‌, ఇన్సూరెన్స్‌ వంటి పత్రాలను ఉన్నాయా లేవా అని చూసేవారు. ఇలా ట్రాఫిక్ పోలీసులు తనిఖీల్లో చాలామంది నిబంధనలు ఉల్లంఘిస్తున్నవారు దొరికిపోయేవారు. కానీ కొద్ది రోజులు నుండి ట్రాఫిక్ జరిమానాలు పై కొన్ని మార్పులు చేయడం తో రోడ్లపై సీసీ కెమెరాలు అమర్చి.. ట్రాఫిక్‌ పోలీసుల చేతికి కూడా డిజిటల్‌ కెమెరాలు ఇచ్చిన తర్వాత పరిస్థితి మారింది. రోడ్డు నిబంధనలను ఉల్లంఘించి వెళ్లేవారిని ఫొటోలు తీసి.. బండి నంబర్‌ ఆధారంగా చలానాలు వేయడంతోనే పోలీసులు సరిపెట్టుకుంటున్నారు. దీంతో వాటిని అలుసుగా తీసుకున్న కొంత మంది మాయగాళ్ళు ప్రజాప్రతినిధుల వాహనాల నంబర్‌ ప్లేట్లకు నకిలీలు తయారు చేసి తమ వాహనాలకు బిగించుకుని ఎంచక్కా తిరిగేస్తున్నారు.

ఇలా మూడేళ్ళ నుండి సీఎం కార్‌ నంబర్‌తో ఉన్న ఏడు నకిలీ వాహనాలపై చలాన్లు జారీ అయినవే. TS09K6666 రిజిస్ట్రేషన్‌ నంబర్‌పై ఏడు చలాన్లు ఉన్నాయి. అందులో ఆరు అతివేగంగా డ్రైవ్ చేస్తూ జారీ అయిన చలాన్ లు కాగా , ఒకటి రాంగ్ పార్కింగ్ చేసినందుకు జారీ అయిన చలాన్లు .. అయితే ఈ కార్ల ఎవరివి ? అస్సలు ఇలా చేస్తున్నది ఎవరు ? ఒకరే ఈ నకిలీ నెంబర్లను వాడుతున్నారా ? లేక ఏడుగురు వేరు వేరా అనేది తేలాల్సి ఉంది. ట్రాఫిక్‌ చలాన్లను తప్పించుకోవడానికి కొందరు ఈ పని చేస్తున్నట్లు ప్రాధమిక దర్యాప్తు తర్వాత పోలీసులు అనుమానిస్తున్నారు. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పరిధిలో నకిలీ నంబర్‌ప్లేట్ల చలాన్లు సుమారు 10 వేలకు పైగా పెండింగ్‌లో ఉన్నాయని , ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిదిలోనే ఏడూ చలాన్ కు 7845 రూపాయలు పెండింగ్ లో ఉంది .. పెండింగ్ చలాన్ లుకు సంబంధించిన ఫోటోలను తేదీ, ప్రాంతాలతో సహా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేశారు. వాటి ప్రకారం.. అవన్నీ బెంజ్‌, పార్చునర్‌, వోల్వో, వోక్స్‌వాగన్‌ ఖరీదయిన కార్లుఉండడం తో పోలిసులు ఆలస్యంగా గుర్తించారు . అందులో ఏ ఒక్కటీ సీఎం కేసీఆర్‌ అధికారిక వాహనం కాదనేది తేలింది.

చలాన్ల నుంచి తప్పించుకోవడం కోసమే ఇలా చేసి ఉంటారని వదిలేస్తే .. దీని అలుసుగా తీసుకొని సంఘవిద్రోహ శక్తులు కూడా ఇలాంటి ప్రయత్నం చేసే అవకాశం ఉంది. ఇలా చేస్తే సీఎం భద్రతకే పెనుముప్పుగా మరే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి వారిపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టాల్సిన భాద్యత అధికారులు పై ఉంది. ఒకే నంబర్‌పై వేర్వేరు వాహనాలు నగర రోడ్లపై చక్కర్లు కొడుతున్నా గుర్తించలేక పోవడం పోలీసులు నిర్లక్షమేనని స్పష్టంగా తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories