టీడీపీ ఎంపీ కార్యాలయంలో పేకాట

x
Highlights

అధికార పార్టీ ఎంపీ కార్యాలయం. అక్కడేం చేసినా పోలీసులు అడగరు. లోపలికి వచ్చే ధైర్యమే ఉండదు. ఇంకేముంది. యథేచ్ఛగా అసాంఘిక కార్యకలాపాలకు తెర తీసారు. ఎంపీ...

అధికార పార్టీ ఎంపీ కార్యాలయం. అక్కడేం చేసినా పోలీసులు అడగరు. లోపలికి వచ్చే ధైర్యమే ఉండదు. ఇంకేముంది. యథేచ్ఛగా అసాంఘిక కార్యకలాపాలకు తెర తీసారు. ఎంపీ కార్యాలయం కావడంతో ఫిర్యాదులొచ్చినా కన్నెత్తి చూడలేదు. దీంతో బహిరంగంగానే ఎంపీ ఆఫీసు పేకాట డెన్‌గా మారిపోయింది. పోలీసులు పట్టుకుంటారనే భయం లేకపోవడంతో భారీ స్థాయిలో పేకాట నిర్వహిస్తున్నారు. ఇందులో అధికార పార్టీ చోటామోటా నేతలు, క్రికెట్‌ బుకీలు కీలకంగా మారారు.

కృష్ణాజిల్లా కైకలూరులో ఎంపీ మాగంటి బాబు అధికారిక కార్యాలయం మూడు ఆసులు, ఆరు కళావరులుగా పేకాట జోరుగా సాగుతోంది. ఈ విషయం స్థానిక పోలీసులకు తెలిసినా ఎంపీ మాగంటి కార్యాలయం కావడంతో అటు వైపు వెళ్లడానికి కూడా సాహసం చేయలేకపోయారు. రైడ్స్ జరగవనే ధైర్యంతో క్రికెట్‌ బుకీలు కూడా భారీ ఎత్తున రంగంలోకి దిగారు. కోత పందాలతో పేకాట రాయుళ్ల జేబులకు భారీ కోతలు పెట్టారు. పేకాటలో ఓడిపోయిన వారి ఆస్తులు కూడా రాయించుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

స్వయంగా ఎంపీ మాగంటి బాబు అండదండలుండడంతో ఆయన కార్యాలయంలో జరుగుతున్న పేకాటలో కోట్లలో డబ్బులు చేతులు మారుతున్నాయంటున్నారు. సంక్రాంతి వంటి రోజుల్లో పేకాట, కోడి పందాలు అడుకోవడం తప్పు లేదని గతంలో మాగంటి బాబు స్వయంగా ప్రకటించారు. అనుమతి లేకుండా పేకాట ఆడడం, అందులోనూ ఎంపీ అధికారిక కార్యాలయంలో నిర్వహించడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

ప్రజా సేవ చేయమని ప్రజలు దేశంలో అత్యున్నత చట్టసభలకు పంపితే.. ఆ అధికారాన్నే అడ్డంగా పెట్టుకొని, చట్టాన్ని ధిక్కరించే పేకాట స్థావరంగా అధికారిక కార్యాలయాన్ని మార్చడంపై ఎంపీ మాగంటి బాబుపై తీవ్రంగా విమర్శలు చెలరేగుతున్నాయి. దీనిపై ఎంపీ మాగంటి బాబు సమాధానం చెప్పాలని, పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories