జూబ్లీహిల్స్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అనూష బ్రెయిన్ డెడ్

జూబ్లీహిల్స్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అనూష బ్రెయిన్ డెడ్
x
Highlights

జూబ్లీహిల్స్ రోడ్ నెం.10 యాక్సిడెంట్‌లో మరో యువతికి బ్రెయిన్‌డెడ్ అయ్యింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అనూషకు.. బ్రెయిన్ డెడ్ అయినట్లు అపోలో హాస్పిటల్...

జూబ్లీహిల్స్ రోడ్ నెం.10 యాక్సిడెంట్‌లో మరో యువతికి బ్రెయిన్‌డెడ్ అయ్యింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అనూషకు.. బ్రెయిన్ డెడ్ అయినట్లు అపోలో హాస్పిటల్ డాక్టర్లు నిర్ధారించారు. మరో యువతి ప్రియకు.. కాలు విరిగిపోయింది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ప్రమాదంలో మస్తానీ అనే యువతి.. స్పాట్‌లోనే మృతి చెందింది.

డైమండ్ హౌస్ దగ్గర జరిగిన ఈ యాక్సిడెంట్‌.. హిట్ అండ్ రన్ కేసుగా పోలీసులు గుర్తించారు. యువతి స్కూటీని ఢీకొట్టిన తర్వాత.. నిందితుడు విష్ణువర్ధన్ పారిపోయేందుకు ప్రయత్నించాడు. భయంతో.. వేగంగా కారు నడపడంతో కిలోమీటర్ దూరంలోనే డివైడర్‌కు ఢీకొట్టాడు.

నిందితుడు విష్ణువర్ధన్ ఫూటుగా మద్యం సేవించి.. కారు నడిపినట్లు గుర్తించారు. పోలీసులు చేసిన బ్రీత్ అనలైజర్ టెస్ట్‌లో.. 200 పాయింట్లకు పైగా ఆల్కహాల్ శాతం నమోదైంది. ప్రస్తుతం నిందితుడు విష్ణువర్ధన్ జూబ్లీహిల్స్ పోలీసుల అదుపులో ఉన్నాడు.

జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.10లోని డైమండ్ హౌస్‌ దగ్గర అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. స్కూటీపై వెళ్తున్న యువతిని.. వెనక నుంచి వేగంగా వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. దీంతో.. మస్తానీ అనే యువతి స్పాట్‌లోనే చనిపోయింది. ఈ ప్రమాదంలో.. తీవ్రంగా గాయపడిన అనూషకు బ్రెయిన్ డెడ్ అయ్యింది. మరో యువతి ప్రియ కాలు విరిగింది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories