నెల్లూరులో కారు బీభత్సం

x
Highlights

నెల్లూరులో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఓ షాపింగ్ మాల్ సెల్లూర్ పార్కింగ్ నుంచి వేగంగా వచ్చింది. తండ్రి వెంట వస్తున్న ఇద్దరు పిల్లలపై దూసుకెళ్లింది....

నెల్లూరులో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఓ షాపింగ్ మాల్ సెల్లూర్ పార్కింగ్ నుంచి వేగంగా వచ్చింది. తండ్రి వెంట వస్తున్న ఇద్దరు పిల్లలపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. పలు వాహనాలు ధ్వంసంమయ్యాయి. రాత్రి వేళ నెల్లూరులోని MGB మాల్ ఆవరణలో ఓ వ్యక్తి ఇద్దరు పిల్లలతో వస్తున్నారు. ఈ మాల్ సెల్లార్ పార్కింగ్ నుంచి ఓ కార్ స్పీడ్ గా దూసుకొచ్చింది. ఇద్దరు చిన్నారులతో పాటు అక్కడ ఆగి వున్న వాహనాలపై దూసుకెళ్లింది. అక్కడే ఉన్న కొందరు కారు బీభత్సం చూసి షాక్ తిన్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ నాలుగేళ్ల డాయల్, మూడేళ్ల రియాను ఆసుపత్రికి తీసుకెళ్లారు. కారు నడిపించిన యువకుడు పూటుగా మద్యం సేవించినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనస్థలికి చేరుకున్నారు. కారు నడిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories