కారులోకి వర్షపు నీరు.. ఊపిరాడక డ్రైవర్‌ మృతి

కారులోకి వర్షపు నీరు.. ఊపిరాడక డ్రైవర్‌ మృతి
x
Highlights

హైదరాబాద్ నగరంలో గత రాత్రి కురిసిన భారీ వర్షం ఒకరిని బలిగొంది. కూకట్ పల్లి జయనగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో సెలార్‌లోకి నీరు రావడంతో ఓ వ్యక్తి మృతి...

హైదరాబాద్ నగరంలో గత రాత్రి కురిసిన భారీ వర్షం ఒకరిని బలిగొంది. కూకట్ పల్లి జయనగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో సెలార్‌లోకి నీరు రావడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. సెల్లార్‌లో కార్ పార్క్ చేసి అందులోనే డ్రైవర్ గోపి నిద్రపోయాడు. అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి వరద నీరు పెద్ద ఎత్తున వచ్చి సెల్లార్‌లో చేరింది. దీంతో కారులో నిద్రిస్తున్న డ్రైవర్ నీట మునిగి చనిపోయాడు. ఉదయం ఈ విషయం తెలుసుకున్న కారు యజమాని పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం శవాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇంటికి వెళ్లడం ఆలస్యం కావడంతో కారులోనే నిద్రపోయినట్టు కారు యజమాని పోలీసులకు వివరించారు.

car driver died in rain water

Show Full Article
Print Article
Next Story
More Stories