టీ సర్కార్‌కు కాగ్ అక్షింతలు

టీ సర్కార్‌కు కాగ్ అక్షింతలు
x
Highlights

తెలంగాణ సర్కార్ తీరును కాగ్ తీవ్ర స్ధాయిలో ఆక్షేపించింది. ఆర్ధిక క్రమశిక్షణ ఏ మాత్రం పాటించడం లేదంటూ 2016-17 వ్యయాలకు సంబంధించిన నివేదికలో...

తెలంగాణ సర్కార్ తీరును కాగ్ తీవ్ర స్ధాయిలో ఆక్షేపించింది. ఆర్ధిక క్రమశిక్షణ ఏ మాత్రం పాటించడం లేదంటూ 2016-17 వ్యయాలకు సంబంధించిన నివేదికలో వెల్లడించింది. ఇసుక కొనుగోలులో 18 కోట్ల మేర అనుచిత లబ్ధి చేకూర్చినట్టు తెలిపింది. అప్పులను రెవెన్యూ రాబడిగా చూపడం ద్వారా ద్రవ్య లోటు తక్కువగా చూపారంటూ చెప్పిన కాగ్ వివిధ పథకాల కోసం డ్రా చేసిన నిధులకు UCలు సమర్పించలేదని తెలిపింది. గరిష్ట సీలింగ్ పరిమితిని మించి విద్యుత్ కొనుగోళ్లు జరిపడం ద్వారా 2012-17 మధ్య 5 వేల 8 వందల 20 కోట్లు అధికంగా ఖర్చు చేశారంటూ తప్పుబట్టింది. ఇదే సమయంలో తగిన ప్రణాళిక లేకుండా ఉచిత విద్యుత్ ను 9 గంటలకు పెంచడం ద్వారా 585 కోట్ల మేర ఖజానాపై భారం పడిందంటూ తన నివేదికలో వెల్లడించింది.

రాష్ట్రాభివృద్ధికి ఐటీ రంగం చోదక శక్తిగా ఉందంటూ అభివర్ణించిన కాగ్ గత ఆర్ధిక సంవత్సరంలో 40 వేల కోట్ల విలువైన ఎగుమతులు జరిగినట్టు వెల్లడించిందిం. దేశ వ్యాప్తంగా 13 శాతం ఎగుమతులు రాష్ట్రం నుంచి జరుగుతున్నాయన్న కాగ్ నూతన సంస్ధలను ఆకర్షించడంలో ప్రభుత్వం చొరవ చూపడం లేదంటూ ఆక్షేపించింది. గడచిన ఐదేళ్లలో కొత్త సంస్ధ ఒక్క టి కూడా రాకపోగా ఇది వరకు భూములు పొందిన సంస్ధలు పనులు ప్రారంభించకండా నిర్లక్ష్యం చూపాయంటూ తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories