వైసీపీలో సి రామచంద్రయ్యకు కీలక బాధ్యతలు అప్పగింత..

nanireddy
Updated on: 24 Dec 2018 4:11 PM IST
వైసీపీలో సి రామచంద్రయ్యకు కీలక బాధ్యతలు అప్పగింత..
X

ఇటీవల కాంగ్రెస్ పార్టీలోనుంచి వైసీపీలో చేరిన మాజీ మంత్రి సి రామచంద్రయ్యకు వైసీపీలో కీలక పదవులు దక్కాయి. పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆయనను ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, అధికార ప్రతినిధిగా నియమించారు. ఈ మేరకు వైసీపీ నుంచి ఓ ప్రకటన వెలువడింది.

కాగా వైయస్ఆర్ కడప జిల్లా రాజంపేటకు చెందిన రామచంద్రయ్య 1981లో తెలుగుదేశం పార్టీ ద్వారా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రిగా ప్రజలకు సేవలందించారు. అలాగే 2016 వరకు ఏపీ శాసనమండలిలో ప్రతిపక్షనేతగా వ్యవహరించారు. ఇటీవల వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు సి రామచంద్రయ్య.

nanireddy

nanireddy

Next Story