చిత్తూరు జిల్లాలో దారుణం: 11 ఏళ్ల బాలికపై అత్యాచారం

చిత్తూరు జిల్లాలో దారుణం: 11 ఏళ్ల బాలికపై అత్యాచారం
x
Highlights

చిత్తూరు జిల్లా పుంగనూరులోని భగత్ సింగ్ కాలనీలో దారుణం జరిగింది. బాలికకు డబ్బు ఆశగా చూపి ఐదుగురు మైనర్లు అత్యాచారానికి పాల్పడిన ఆలస్యంగా...

చిత్తూరు జిల్లా పుంగనూరులోని భగత్ సింగ్ కాలనీలో దారుణం జరిగింది. బాలికకు డబ్బు ఆశగా చూపి ఐదుగురు మైనర్లు అత్యాచారానికి పాల్పడిన ఆలస్యంగా వెలుగుచూసింది స్ధానికంగా ఉన్న బాలికను తొలుత లోబర్చుకున్న యువకుడు ...తన స్నేహితులతో విషయం చెప్పడంతో బ్లాక్ మెయిల్ కు దిగిన నలుగురు స్నేహితులు అత్యాచారానికి పాలడ్డారు. ఎవరికైనా చెబితే చంపుతామంటూ నాలుగు నెలలుగా ఇదే తరహాలో అత్యాచానికి పాల్పడుతూ వచ్చారు. నిన్న ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లి నిలదీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు విచారణ జరిపిన పోలీసులు విషయం నిజమని తెలియడంతో ఐదుగురు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు.

ఈ విషయం తెలుసుకున్న స్ధానికులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ దగ్గరకు చేరుకుని నిందితులను తమకు అప్పగించాలంటూ ఆందోళనకు దిగారు. తక్షణమే కఠినమైన శిక్ష విధించాలంటూ స్టేషణ్ ఎదుట భైఠాయించి నిరసనకు దిగారు. దీంతో అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత రేగింది. ముందస్తు జాగ్రత్తగా అదనపు బలగాలను రప్పించిన పోలీసులు ... బాలిక తరపు బంధువులతో చర్చలు జరిపారు. పూర్తి న్యాయం చేస్తామంటూ పోలీసులు హామి ఇవ్వడంతో తాత్కాలికంగా ఆందోళన విరమించారు. పరీక్షల నిమిత్తం బాలికను పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలిక తరపు బంధువులు దాడికి దిగే అవకాశాలు ఉండటంతో అత్యాచారానికి పాల్పడిన ఐదుగురు మైనర్లను పోలీసులు రహస్య ప్రదేశానికి తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories