కూకట్‌ పల్లిలో నడిరోడ్డుపై ఇంటర్‌ విద్యార్థి హత్య

కూకట్‌ పల్లిలో నడిరోడ్డుపై ఇంటర్‌ విద్యార్థి హత్య
x
Highlights

హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో ఇంటర్‌ విద్యార్ధి దారుణ హత్యకు గురికావడం స్థానికంగా కలకలం రేపుతోంది. మూసాపేటకు చెందిన సుధీర్‌ పరీక్ష రాసేందుకు వెళ్తుండగా...

హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో ఇంటర్‌ విద్యార్ధి దారుణ హత్యకు గురికావడం స్థానికంగా కలకలం రేపుతోంది. మూసాపేటకు చెందిన సుధీర్‌ పరీక్ష రాసేందుకు వెళ్తుండగా దుండగులు నడిరోడ్డుపైనే వేటకొడవళ్లతో నరికి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. స్నేహితులతో జరిగిన వివాదం కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. సుధీర్‌ స్నేహితులు నవీన్‌, కృష్ణ, మహీ, తేజ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories