తమ్ముడు ప్రేమకు అన్న బలి

తమ్ముడు ప్రేమకు అన్న బలి
x
Highlights

ప్రియురాలు తనతో పెళ్ళికి నిరాకరించిందన్న కారణంగా ఓ యువకుడు మధ్యంలో విషం కలుపుకుని తాగాడు. అందులో విషం ఉందని తెలియక దాన్ని సేవించి అన్న మృతి చెందాడు. ఈ...

ప్రియురాలు తనతో పెళ్ళికి నిరాకరించిందన్న కారణంగా ఓ యువకుడు మధ్యంలో విషం కలుపుకుని తాగాడు. అందులో విషం ఉందని తెలియక దాన్ని సేవించి అన్న మృతి చెందాడు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. తూత్తుకుడి మణినగర్‌ పుదూర్‌ కు చెందిన రాజా, విజయ్‌ అన్నదమ్ముళ్లు. రాజాకు ఇటీవలే వివాహమైంది. చెన్నైలోని ఓ సంస్థలో పనిచేస్తున్న విజయ్‌కు ఓ యువతితో పరిచయం ఏర్పడి అదికాస్త ప్రేమగా మారింది. కొంతకాలం వీరి ప్రేమ వ్యవహారం సాఫీగా సాగినా మధ్యలో విబేధాలు వచ్చాయి. దాంతో ఆమె పెళ్ళికి నిరాకరించింది. ఈ క్రమంలో ఆమె విజయ్ నుంచి దూరమైంది. ప్రియురాలు దూరమైందన్న మనోవేధనతో విజయ్ కృంగిపోయాడు. ఆదివారం మద్యం బాటిల్ లో విషం కలుపుకుని తాగాడు.ఇంట్లోనే అపస్మారక స్థితిలో పడివున్ననాడు. అయితే మద్యం బాటిల్ లో విషం ఉందని తెలియక విజయ్ అన్న రాజా మిగిలివున్న మద్యాన్ని సేవించాడు. దాంతో అతను కూడా అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. ఇరుగుపొరుగు వారు చూసి వారిద్దరిని ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ రాజా మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా తమ్ముడు ప్రేమకు అన్న బలైపోయాడని కుటుంబసభ్యులు రోధించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories