అన్న చేతిలో చెల్లెలు దారుణ హత్య

అన్న చేతిలో చెల్లెలు దారుణ హత్య
x
Highlights

పొలం తనకు అమ్మలేదన్న కోపంతో ఓ అన్న,చెల్లిని నడిరోడ్డుపై నరికి చంపాడు. కలకలం రేపుతున్న ఈ ఘటన ప్రకాశం జిల్లా కారంచేడు మండలం స్వర్ణలో మంగళవారం...

పొలం తనకు అమ్మలేదన్న కోపంతో ఓ అన్న,చెల్లిని నడిరోడ్డుపై నరికి చంపాడు. కలకలం రేపుతున్న ఈ ఘటన ప్రకాశం జిల్లా కారంచేడు మండలం స్వర్ణలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...కారంచేడు మండలం స్వర్ణ గ్రామానికి చెందిన సొద రాధాకృష్ణమూర్తి, రాజారావు అన్నదమ్ములు. పెద్దవాడైన రాధాకృష్ణకు నలుగురు కుమార్తెలు ఉన్నారు. రాజారావుకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. రాధాకృష్ణకు చెందిన ఎకరం పొలం విషయంలో ఈ రెండు కుటుంబాల మధ్య వివాదం ఉంది. పొలం తనకే విక్రయించాలంటూ రాజారావు కుమారుడు సింగయ్య (40) గత కొంతకాలంగా పట్టుబడుతున్నాడు. ఇందుకు రాధాకృష్ణ నిరాకరించాడు. దీంతో ఆ పొలం మరెవరూ కొనకుండా అడ్డంకులు సృష్టించాడు. సింగయ్య అడ్డుపడుతున్నా రాధాకృష్ణ ఎలాగోలా పొలాన్ని అమ్మేసి ఆరు నెలల క్రితం కుమార్తె పద్మావతికి పెళ్లి చేశాడు. సోషల్ వర్క్‌లో పీజీ చేసిన పద్మావతి భర్తతో కలిసి హైదరాబాద్‌లో ఉంటోంది.

పద్మావతి సోషల్‌ వర్క్‌లో పీజీ చేసింది. స్వచ్ఛ భారత్‌ కార్యక్రమాల్లో విరివిగా పాల్గొని ప్రభుత్వ అధికారుల ప్రశంసలు పొందింది. మంగళవారం గాంధీ జయంతిని పురస్కరించుకొని ఒంగోలులో అవార్డు స్వీకరించాల్సి ఉంది. హైదరాబాద్‌ నుంచి వచ్చిన ఆమె మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో ఒంగోలు వెళ్లేందుకు స్వర్ణలో బస్‌షెల్టర్‌ వద్దకు వస్తుండగా అక్కడే మాటు వేసిన సింగయ్య ఒక్కసారిగా ఆమెపై కత్తితో దాడి చేశాడు. ఛాతీకింద, మెడపైన సుమారు 10 చోట్ల ఆమెను కిరాతకంగా నరికాడు. దీంతో పద్మావతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. పారిపోయేందుకు యత్నించిన సింగయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories