‘తెలంగాణ భవన్ ను పేల్చేస్తాం’

lakshman
Updated on: 24 Dec 2018 1:01 PM IST
‘తెలంగాణ భవన్ ను పేల్చేస్తాం’
X

తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ ను పేల్చేస్తామంటూ ఓ దుండగుడు ఫోన్ చేశాడు. సరదాగానో.. లేదంటే టీఆర్ఎస్ పై కోపంతోనో తెలియదు కానీ.. అతడు కాస్త సీరియస్ గానే వార్నింగ్ ఇచ్చినట్టున్నాడు. దీంతో.. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. భద్రతా సిబ్బంది.. తెలంగాణ భవన్ కు దారి తీసే అన్ని మార్గాల్లోనే భద్రత కట్టుదిట్టం చేశారు.

భవన్ లో కూడా అడుగడుగూ గాలించారు. క్షుణ్నంగా తనిఖీలు చేశారు. కొత్తవారిని అన్ని పరీక్షలు చేసి అపాయం లేదని నిర్థారించుకున్నాకే లోపలికి అనుమతించారు. విషయం బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇదే సమయంలో.. ఫోన్ చేసిన దుండగుడి గురించి గాలించారు. ఎస్సార్ నగర్, యూసఫ్ గూడ నుంచి ఫోన్ చేసినట్టు గుర్తించారు. చివరికి అతడిని అదుపులోకి తీసుకుని.. ఆదిలాబాద్ కు చెందిన యువకుడిగా గుర్తించారు.

ఎందుకు ఫోన్ చేశాడు.. ఎవరిని టార్గెట్ చేశాడు.. ఎవరు చేయమన్నారు.. వాళ్ల వెనక ఎవరున్నారు.. ఈ బెదిరింపుల వెనక ఉద్దేశమేంటి? ఇలా.. రకరకాల అనుమానాలను ఇప్పుడు పోలీసులు నివృత్తి చేసుకునే దిశగా దుండుగుడిని విచారణ చేస్తున్నారు.

lakshman

lakshman

Next Story