మరో 16 మంది అభ్యర్థులను ప్రకటించిన బీఎల్‌ఎఫ్‌

nanireddy
Updated on: 24 Dec 2018 4:03 PM IST
మరో 16 మంది అభ్యర్థులను ప్రకటించిన బీఎల్‌ఎఫ్‌
X

త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం బహుజన లెప్ట్‌ ఫ్రంట్(బీఎల్‌ఎఫ్‌)
సిద్ధమైంది. ఇప్పటికే మూడు జాబితాలను విడుదల చేసిన కాంగ్రెస్ తాజాగా అభ్యర్థుల నాలుగో జాబితాను విడుదల చేసింది. ఈ మేరకు బీఎల్‌ఎఫ్‌ కన్వీనర్‌ తమ్మినేని వీరభద్రం ఈ జాబితాను విడుదల చేశారు. ఇందులో 16 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. కొత్తగూడెం కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థి ఎడవల్లి కృష్ణ కు బిఎల్ ఎఫ్ పార్టీ ద్వారా సీటు కేటాయించారు. సీపీఎం నుంచి నకిరేకల్‌ అభ్యర్థిగా ఎస్సి వర్గానికి చెందిన నగేష్‌కి చోటు లభించింది. నాలుగో జాబితాలో ఎస్సీలకు మూడు, ఎస్టీలకు రెండు, ముస్లీం-5, బీసీ-5, ఎంబీసీలకు ఒక సీటు చొప్పున మొత్తం 16 సీట్లను ప్రకటించారు.

nanireddy

nanireddy

Next Story