మంగళగిరిలో బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి శంకుస్థాపన

nanireddy
Updated on: 24 Dec 2018 3:28 PM IST
మంగళగిరిలో బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి శంకుస్థాపన
X

ఏపీలో పార్టీ పటిష్టతపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో.. రాష్ట్రం నుంచే అన్ని కార్యకలాపాలను ప్రారంభించాలని అనుకుంటోంది. ఈ క్రమంలో రాష్ట్ర రాజధాని ప్రాంతమైన మంగళగిరిలో పార్టీ రాష్ట్ర కార్యాలయానికి శంకుస్థాపన చేయనున్నారు. కేంద్ర హోమ మంత్రి రాజ్ నాధ్ సింగ్, ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఈ కార్యక్రమానికి శంకుస్థాపన చేయనున్నారు. మరోవపు గుంటూరు ఇన్నర్‌ రింగ్‌రోడ్డులోని వీఆర్‌ గార్డెన్స్‌ ఎదురుగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తోంది. దీనికి రాజ్‌నాథ్‌ సింగ్‌ సహా ప్రముఖ నేతలు హాజరయ్యే అవకాశముంది. మంగళగిరిలో శంకుస్థాపన చేయనున్న పార్టీ రాష్ట్ర కార్యాలయానికి భారీ బహిరంగ సభ వేదిక నుంచే రిమోట్‌ ద్వారా శిలాఫలకాన్ని రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆవిష్కరిస్తారని బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.

nanireddy

nanireddy

Next Story