బీజేపీలో చెలరేగిన అసమ్మతి

బీజేపీలో చెలరేగిన అసమ్మతి
x
Highlights

బీజేపీలో అసంతృప్తులు భగ్గుమంటున్నాయి. సెకండ్‌ లిస్ట్‌లోనూ అవకాశం దక్కని ఆశావహులు పార్టీ కార్యాలయాల ఎదుట ఆందోళనకు దిగారు. టికెట్లు అమ్ముకుంటున్నారంటూ...

బీజేపీలో అసంతృప్తులు భగ్గుమంటున్నాయి. సెకండ్‌ లిస్ట్‌లోనూ అవకాశం దక్కని ఆశావహులు పార్టీ కార్యాలయాల ఎదుట ఆందోళనకు దిగారు. టికెట్లు అమ్ముకుంటున్నారంటూ అధిష్టానంపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అభ్యర్థుల దిష్టిబొమ్మలు దగ్ధం చేసిన నిరసన తెలిపారు.

హైదరాబాద్ బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. శేరిలింగంపల్లి టికెట్టు యోగానంద్‌కు కేటాయించడంతో ఆశావాహులు నరేష్, భాస్కర్ రెడ్డి మద్దతు దారులు ఆందోళన చేపట్టారు. బీజేపీ కార్యాలయం పైకెక్కి టికెట్లు అమ్ముకుంటున్నారంటూ నినాదాలు చేశారు. కార్యాలయం పైకి ఎక్కిన వారిని సిబ్బంది కిందకు దించారు శేరిలింగంపల్లి అభ్యర్థి యోగానంద్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అటు, నిజామాబాద్ అర్బన్ లో బీజేపీలో అసమ్మతి భగ్గుమంది. అర్బన్ అభ్యర్తిగా యెండల‌ను ప్రకటించడంతో ధన్‌పాల్ వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీంతో బీజేపీ కార్యాలయంపై దాడి చేసి, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. బీజేపీకి రాజీనామా చేసే యోచనలో ధన్ పాల్ ఉన్నట్లు తెలుస్తోంది.

BJP Telangana leaders fight against on party high command

Show Full Article
Print Article
Next Story
More Stories