హెలీకాప్టర్‌ నుంచి జారిపడ్డ అమిత్‌షా

nanireddy
Updated on: 24 Dec 2018 4:13 PM IST
హెలీకాప్టర్‌ నుంచి జారిపడ్డ అమిత్‌షా
X

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా హెలీకాప్టర్‌ నుంచి జారిపడ్డారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన మిజోరాంలో జరిగింది. మిజోరాం ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్ షా పశ్చిమ తాయ్‌పూయ్‌ నియోజకవర్గంలోని త్లబంగ్ గ్రామానికి వెళ్లారు. అక్కడికి వచ్చిన తర్వాత హెలికాప్టర్ దిగబోయిన ఆయన.. పొరపాటున ఓ మెట్టు వదిలేశారు. దీంతో ఒక్కసారిగా నేలపై బోర్లా పడిపోయారు. అమిత్‌షాతో పాటు హెలికాప్టర్‌లో వెళ్లిన మరో వ్యక్తి ఆయనను పైకి లేపారు. అయితే ఎవరో యాదృచ్చికంగా తీస్తున్న వీడియో ఇప్పుడు సామజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

nanireddy

nanireddy

Next Story