మోడీ ప్రభంజనానికి భయపడే ముందస్తు...

x
Highlights

మోదీ ప్రభంజనంలో కొట్టుకుపోతాననే భయంతో కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని బీజేపీ నేత రాంమాధవ్ అన్నారు. అవినీతిలో తెలుగు రాష్ట్రాలు రికార్డు...

మోదీ ప్రభంజనంలో కొట్టుకుపోతాననే భయంతో కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని బీజేపీ నేత రాంమాధవ్ అన్నారు. అవినీతిలో తెలుగు రాష్ట్రాలు రికార్డు సాధించాయన్నారు రాంమాధవ్. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో పార్టీ కార్యకర్తల సన్నాహక సమావేశానికి హాజరైన ఆయన కేసీఆర్ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. దేశంలో అవినీతిలో తెలంగాణ 2వ స్థానంలో, ఏపీ 4వ స్థానంలో ఉన్నాయని విమర్శించారు. నాలుగున్నరేళ్లలో తెలంగాణలో అసమర్ధపాలన సాగిందని మండిపడ్డారు. తెలంగాణకు కేంద్రం లక్షా 20వేల కోట్లు ఇచ్చిందన్న ఆయన..ఆ నిధులు ఎటు పోయాయని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబ పాలన వల్ల బంగారు తెలంగాణ కాదు.. అప్పుల తెలంగాణ అయ్యిందని విమర్శించారు రాంమాధవ్.

Show Full Article
Print Article
Next Story
More Stories