రాయలసీమపై చంద్రబాబుకు ప్రేమ లేదు: సోము వీర్రాజు

రాయలసీమపై చంద్రబాబుకు ప్రేమ లేదు: సోము వీర్రాజు
x
Highlights

సీఎం చంద్రబాబుకు రాయలసీమపై ప్రేమలేదన్నారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. పోలవరాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిధులతో ఎలా పూర్తి చేస్తామంటున్నారో.. మిగిలిన...

సీఎం చంద్రబాబుకు రాయలసీమపై ప్రేమలేదన్నారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. పోలవరాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిధులతో ఎలా పూర్తి చేస్తామంటున్నారో.. మిగిలిన ప్రాజెక్టులను కూడా అలాగే పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై బీజేపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్న ఆయన ... చంద్రబాబు సర్కార్ అవినీతిలో కూరుకుపోయిందని చెప్పారు. రాష్ట్రంలో ఏ మంత్రికీ అధికారం లేదని, కేవలం సీఎం, ఆయన తనయుడి కనుసన్నల్లోనే పాలన నడుస్తోందని మండిపడ్డారు. వెనుకబడిన రాయలసీమ జిల్లాలకు 1050కోట్ల రూపాయలను కేంద్రం విడుదల చేసిందని, ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories