బీజేపీ ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ‌్యలు.. నేరుగా సీఎం చంద్రబాబుపైనే ఘాటు విమర్శలు

బీజేపీ ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ‌్యలు.. నేరుగా సీఎం చంద్రబాబుపైనే ఘాటు విమర్శలు
x
Highlights

బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోసారి సంచలన వ్యాఖ‌్యలు చేశారు. ఈసారి డైరెక్ట్‌గా ముఖ్యమంత్రి చంద్రబాబును, టీడీపీ ప్రభుత్వాన్నే టార్గెట్‌ చేశారు....

బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోసారి సంచలన వ్యాఖ‌్యలు చేశారు. ఈసారి డైరెక్ట్‌గా ముఖ్యమంత్రి చంద్రబాబును, టీడీపీ ప్రభుత్వాన్నే టార్గెట్‌ చేశారు. పోలవరం ప్రాజెక్టు బాధ్యత కేంద్రానిదేనన్న సోము వీర్రాజు పోలవరంపై చంద్రబాబు సమయం వృథా చేసుకోవద్దంటూ సూచించారు. పోలవరం గురించి ఆలోచించడం మానేసి మిగతా ప్రాజెక్టులపై చంద్రబాబు దృష్టిపెడితే మంచిదన్నారు. ఇక రాజధాని నిర్మాణంపైనా సోము వీర్రాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డిజైన్ల పేరుతో కాలయాపన చేస్తున్నారంటూ ఘాటుగా విమర్శించారు. కేవలం 5వందల కోట్లతో ఛత్తీస్‌గడ్ నయా రాయ్‌పూర్‌ను నిర్మించిందని గుర్తుచేశారు. అంతేకాదు ప్రత్యేక హోదా అక్కర్లేదు ప్యాకేజీ కావాలని చంద్రబాబే అడిగారని సోము వీర్రాజు సంచలన వ్యా‌ఖ్యలు చేశారు. కేంద్రం కంటే తామే ఎక్కువ ప్రగతి సాధించామని చంద్రబాబు చెబుతున్నారంటే కేంద్రం సాయం చేస్తుందనేది అర్ధమవుతోందన్నారు. ఏపీలో బీజేపీ ఎదగడం ఖాయమన్న సోము వీర్రాజు అందులో ఎవరికీ ఎలాంటి సందేహం అక్కర్లేదన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories