‘24 గంటల్లో కుమారస్వామి ప్రభుత్వాన్ని కూలుస్తాం’

Chandram
Updated on: 28 Dec 2018 12:17 PM IST
‘24 గంటల్లో కుమారస్వామి ప్రభుత్వాన్ని కూలుస్తాం’
X


జేడీఎస్ కాంగ్రెస్ కూటమిపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి ఉమేశ్ కట్టి. మరో ఇరవై నాలుగు గంటల్లో జేడీఎస్-కాంగ్రెస్ కూటమి సంకీర్ణం సర్కార్ కుప్పకూలుతుదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ సీఎం యడ్యూరప్ప ఆధ్వర్యంలో నేడు (బుధవారం) మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమేశ్ కట్టి మాట్లాడుతూ ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన 15మంది రెబల్ ఎమ్మెల్యేలు మాతో ఫుల్ టచ్ లో ఉన్నరంటూ స్పష్టం చేశారు. త్వరలోనే వాళ్లు తప్పకుండా బయటకు వస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంకా ఎంత సమయంలేదు మరో ఒక్కరోజులోనే కుమారస్వామి సర్కార్ నిట్టనిలువునా కుప్పకూలుతుందని అన్నారు. అతి త్వరలోనే బీజేపీ పార్టీ కొత్త సర్కారును ఏర్పాటు చేస్తుందని వెల్లడించారు.

Chandram

Chandram

Next Story