ఎమ్మెల్యే రాజీనామా.. చంద్రబాబుకు అల్టిమేటం

ఎమ్మెల్యే రాజీనామా.. చంద్రబాబుకు అల్టిమేటం
x
Highlights

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం శాసనసభ్యుడు పైడికొండల మాణిక్యాల రావు రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించారు. నియోజకవర్గ అభివృద్ధని పట్టించుకోవడం...

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం శాసనసభ్యుడు పైడికొండల మాణిక్యాల రావు రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించారు. నియోజకవర్గ అభివృద్ధని పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ సీఎం చంద్రబాబుకు రాజీనామా లేఖ పంపారు. గతంలో సీఎం ఇచ్చిన 29 హామీలను ప్రస్తావిస్తూ మూడు పేజీల లేఖ రాశారు. సమస్యల పరిష్కారానికి 15 రోజుల్లోపు కార్యాచరణ చేపట్టకపోతే తన లేఖను రాజీనామా లేఖగా స్పీకర్‌కు పంపాలంటూ సీఎంను కోరారు. అదే రోజు నుంచి తాను నిరవధిక నిరాహార దీక్ష చేపడుతానంటూ లేఖలో ఆయన హెచ్చరించారు. జిల్లా నుంచి ప్రతిపక్షానికి ప్రాతినిధ్యం లేకుండా తీర్పునిచ్చినా ఆశించిన స్ధాయి అభివృద్ధి జరగడం లేదంటూ మాణిక్యాల రావు ఆరోపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories