ఏపీ కేబినేట్‌కు బీజేపీ మంత్రులు రాజీనామా

ఏపీ కేబినేట్‌కు బీజేపీ మంత్రులు రాజీనామా
x
Highlights

ఏపీ మంత్రివర్గం నుండి వైదొలగాలని బీజేపీ నిర్ణయం తీసుకొంది. రాష్ట్ర కేబినెట్‌లో మంత్రులుగా కొనసాగుతున్న ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు నేడు మంత్రి పదవులకు...

ఏపీ మంత్రివర్గం నుండి వైదొలగాలని బీజేపీ నిర్ణయం తీసుకొంది. రాష్ట్ర కేబినెట్‌లో మంత్రులుగా కొనసాగుతున్న ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు నేడు మంత్రి పదవులకు రాజీనామాలు సమర్పించనున్నారు. నేడు జరగనున్న కేబినేట్‌ భేటీలో కూడా మంత్రులు పాల్గొనబోరని బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ రాత్రి విజయవాడలో జరిగిన బీజేపీ అత్యవసర భేటీ తర్వాత ప్రకటించారు.

కేంద్ర కేబినెట్‌లో ఉన్న టీడీపీ మంత్రులను రాజీనామా చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించిన నేపథ్యంలో ఏపీ కేబినెట్ నుంచి తాము కూడా వైదొలుగుతున్నట్లు ఏపీ బీజేపీ ప్రకటించింది. తమ మంత్రులు ఇవాళ రాజీనామాలు చేస్తారని ఏపీ బీజేపి నేతలు ఆకుల సత్యనారాయణ తెలిపారు.

కేంద్ర మంత్రివర్గం నుంచి వైదొలగాలని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన వెంటనే ఏపీ బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు విజయవాడ ఐలాపురం హోటల‌్‌లో అత్యవసరంగా సమావేశమయ్యారు. తాము కూడా రాష్ట్ర కేబినెట్ నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకొన్నారు. గురువారం రాజీనామాలు చేయాలని నిర్ణయించారు. నేడు జరగనున్న కేబినేట్‌ భేటీలో కూడా మంత్రులు పాల్గొనరని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీ కట్టుబడి ఉందని.. ఏపీకి ఇచ్చిన హమీలను అమలు చేసేందుకు ప్రయత్నిస్తోందని నేతలు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ఏమేం చేసిందో బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు అందరూ కలసి వివరిస్తారని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories