నేడు బీజేపీ నేతల ప్రచార షెడ్యూల్‌ ఇదే..

nanireddy
Updated on: 24 Dec 2018 4:22 PM IST
నేడు బీజేపీ నేతల ప్రచార షెడ్యూల్‌ ఇదే..
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారపర్వం కీలకదశకు చేరుకోవడంతో భాజపా అగ్రనేతలు రాష్ట్రానికి వరుస కడుతున్నారు. పార్టీ అభ్యర్థులకు ప్రచారం కోసం పలు నియోజకవర్గాలకు వస్తున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీ ఒకసారి, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రెండుసార్లు వచ్చి వెళ్లిన విషయం తెలిసిందే. అమిత్‌షా తెలంగాణకు ఆదివారం మరోసారి ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ కూడా నేడు తెలంగాణలో భాజపా అభ్యర్థులకోసం ప్రచారం చేయనున్నారు. 3న హైదరాబాద్‌ ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించే సభకు ప్రధాని మోదీ వస్తున్నారు. ఈ సభకోసం భాజపా నేతలు ఏర్పాట్లుచేస్తున్నారు. నేడు భాజపా నేతల ప్రచార షెడ్యూల్‌ ఇదీ..

అమిత్‌షా
* ఉదయం 11.50కి నారాయణపేటలో బహిరంగ సభ, మధ్యాహ్నం 1.35కి కల్వకుర్తిలో, సాయంత్రం 3.25 కామారెడ్డిలో, 5.20కి మల్కాజిగిరిలో సభలు

యోగి ఆదిత్యనాథ్‌
* మధ్యాహ్నం 1.50కి తాండూరులో, సాయంత్రం 3 గంటలకు సంగారెడ్డిలో సభలు. 4.05 గంటలకు బోడుప్పల్‌లో మేడ్చల్‌ నియోజకవర్గ సభ, 5.05 గంటలకు గోషామహల్‌లో సభ.

నితిన్‌ గడ్కరీ
* ఉదయం 11 గంటలకు ఉప్పల్‌లో, 12.45కి కొల్లాపూర్‌లో, మధ్యాహ్నం 3కు సూర్యాపేటలో, 4.55 గంటలకు సీతాఫల్‌మండీలో బహిరంగ సభలు.

nanireddy

nanireddy

Next Story