చంద్ర‌బాబు మ‌హాన‌టుడు

చంద్ర‌బాబు మ‌హాన‌టుడు
x
Highlights

ఏపీ సీఎం చంద్ర‌బాబు పై బీజేపీ నేత‌లు మండిప‌డుతున్నారు. ఏపీకి కేంద్రం అన్యాయం చేస్తుంద‌ని టీడీపీ నేత‌లు న‌ల్ల బ్యాడ్జీలు క‌ట్టుకొని తిరుగుతున్నార‌ని,...

ఏపీ సీఎం చంద్ర‌బాబు పై బీజేపీ నేత‌లు మండిప‌డుతున్నారు. ఏపీకి కేంద్రం అన్యాయం చేస్తుంద‌ని టీడీపీ నేత‌లు న‌ల్ల బ్యాడ్జీలు క‌ట్టుకొని తిరుగుతున్నార‌ని, అలా స్పీక‌ర్ కూడా న‌ల్ల‌బ్యాడ్జి ధ‌రించి నిర‌స‌న చేయోచ్చా అంటూ బీజేఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు మండిప‌డ్డారు. రాజ‌కీయాల్లో చంద్ర‌బాబు మ‌హాన‌టుడ‌ని అని ఎద్దేవా చేశారు.రాష్ట్రానికి ఇచ్చిన హామీల్ని కేంద్రం నేర‌వేరుస్తుంద‌ని చెప్పుకొచ్చారు. అయినా టీడీపీ నేత‌లు బీజేపీకి వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేస్తున్నార‌ని ఆరోపించారు. రాష్ట్రాన్ని ఆర్ధికంగా ఆదుకుంటామ‌ని కేంద్రం ప‌దేప‌దే చెబుతున్నా ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డంలేద‌ని అన్నారు.
మ‌రోవైపు ఏపీ ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తూ విజ‌య‌వాడ‌లో బీజేపీ నేత‌లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తెలుగువారి ఆత్మ‌గౌర‌వం, ఆత్మాభిమానం అని రెచ్చ‌గొడుతున్నట్లు అందులో పేర్కొన్నారు. అంతేకాదు ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన నిధుల‌పై క్లారిటీ ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం ఇచ్చిన నిధుల‌తో రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారు. రాష్ట్రానికి ఉన్న అప్పులెంత‌, ఆస్తులంతా త‌దిత‌ర అంశాల‌పై శ్వేత ప‌త్రం విడుదల చేయాల‌ని సూచిస్తున్న‌ట్లు ఫ్లెక్సీలో ఉంది.
టీడీపీ నేత‌లు ప్ర‌త్యేక హోదా పేరుతో రాజ‌కీయం చేస్తున్నార‌ని బీజేపీ నేత‌లు అంటున్నారు. గ‌తంలో చంద్ర‌బాబు ప్ర‌త్యేక‌హోదా అవ‌సరం లేదు. ప్ర‌త్యేక ప్యాకేజీ కావాల‌ని అడిగారు. ఇప్పుడు తాము ప్యాకేజీ ఇస్తామంటే, ప్ర‌త్యేక‌హోదా కావాల‌ని అడగ‌డం విడ్డూరంగా ఉంద‌ని క‌మ‌లం నేత‌లు మండిప‌డుతున్నారు. హోదాపై టీడీపీ మాట మార్చిందని, అఖిల పక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు అన్యాయంగా ఉన్నాయని, హోదా కోసం విద్యార్థులు, ఉద్యోగాలు కలిసి రావాలని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందని బీజేపీ నేతలు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories