పొత్తులపై స్పష్టత ఇచ్చిన బీజేపీ నేత కిషన్ రెడ్డి

పొత్తులపై స్పష్టత ఇచ్చిన బీజేపీ నేత కిషన్ రెడ్డి
x
Highlights

కాంగ్రెస్ రావద్దు అనుకునే వారు.. తెరాస పోవాలి అనుకునే వారితోనే కలిసివెళతాం.. తెలంగాణ బీజేపీ సీనియర్ నేత అంబర్ పెట్ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి కొద్దీ...

కాంగ్రెస్ రావద్దు అనుకునే వారు.. తెరాస పోవాలి అనుకునే వారితోనే కలిసివెళతాం..


తెలంగాణ బీజేపీ సీనియర్ నేత అంబర్ పెట్ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి కొద్దీ సేపటిక్రితం మీడియాతో మాట్లాడారు. తెలంగాణాలో పొత్తు ఎవరితో ఉండదు అని అయన స్పష్టం చేసారు.. కాంగ్రెస్ రావద్దు తెరాస పోవాలి అనే ఉద్దేశ్యంతో ఉన్న వారిని కలుపుకొని వెళ్తామని అయన తెలిపారు. అధికార పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా 60 మందిని ప్రకటించింది మరి బీజేపీ ఎప్పుడు అభ్యర్థులను ప్రకటిస్తుంది అని విలేకరి అడిగిన ప్రశ్నకు కిషన్ రెడ్డి స్పందిస్తూ.. గతంలో ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ తొందర పడి అభ్యర్థులను ప్రకటించలేదని, ఎన్నికల షెడ్యూల్ విడుదలయిన తర్వాత బీజేపీ హై కమాండ్ నిర్ణయం తీసుకుంటుంది అని వివరించారు. తెలంగాణకు సంబంధించి యువతను తమ పార్టీలోకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.. రాబోయే ఎన్నికల కోసం పూర్తి స్థాయిలో బీజేపీ పార్టీ సిద్ధంగా ఉన్నట్లు అయన వివరించారు. గ్రామీణ ప్రాంతాలలో తన పార్టీకి మంచి ఆదరణ లభిస్తుంది అని వ్యాఖ్యానించారు. అదే విదంగా నిరుద్యోగ సంఘాలు, రైతు సంఘాలు, కుల సంఘాలు బీజేపీ కి మద్దతిస్తాయనే ఆశాభావం వ్యక్తం చేసారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ టీడీపీ పొత్తుపై స్పందించిన కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీని ఎన్టీఆర్ స్థాపించారు.. ఈ రోజు చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకొని వెళ్లడం అంటే ఎన్టీఆర్ ఆలోచనా ఆశయాలను అయన విధానాలను తుంగలో తొక్కినట్లే అని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories