తెలంగాణలో మరో కూటమి?

x
Highlights

ఎన్నికల వేళ తెలంగాణ బీజేపీ రూటు మార్చింది. నిన్నటి వరకు సొంతంగానే పోటీ చేస్తామంటూ ప్రకటించిన నేతలు చిన్న చితక పార్టీలను కలుపుకుపోవాలని భావిస్తున్నారు....

ఎన్నికల వేళ తెలంగాణ బీజేపీ రూటు మార్చింది. నిన్నటి వరకు సొంతంగానే పోటీ చేస్తామంటూ ప్రకటించిన నేతలు చిన్న చితక పార్టీలను కలుపుకుపోవాలని భావిస్తున్నారు. ఇందుకోసం యువ తెలంగాణ పార్టీతో పొత్తుకు అగ్ర నేతలు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. వివిధ పార్టీల్లోని అసంతృప్తు నేతలకు అవకాశం కల్పించేలా యువ తెలంగాణతో నేతలు చర్చలు జరుపుతున్నారు. బీజేపీలోకి నేరుగా వచ్చేందుకు సుముఖంగా లేని నేతలకు యువ తెలంగాణ ద్వారా టికేట్లు కేటాయించాలని నిర్ణయించినట్టు సమాచారం. రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యుడు ప్రదీప్‌ కొత్త చేరికల కోసం కీలక మంత్రాంగం నడుపుతున్నట్లు సమాచారం.


కాంగ్రెస్‌పై అసంతృప్తితో ఉన్న ఓ కీలక నేత ఈ ప్రతిపాదన చేసినట్టు సమాచారం. ఈ కూటమితో ఇప్పటికే మహాకూటమికి చెందిన కొందరు నేతలు టచ్‌లో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. బీజేపీలోకి నేరుగా వస్తే మైనార్టీల ఓట్లు దూరం అవుతాయనే కోణంలో ఈ కూటమిని ఏర్పాటు చేసినట్టు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. బీజేపీ పొత్తులు తెరపైకి వస్తే టీఆర్ఎస్ మాత్రమే ఒంటరిగా పోటీ చేసినట్టు అవుతుంది. ఇప్పటికే టీడీపీ, కాంగ్రెస్‌, సీపీఐ, టీజేఎస్‌లు మహాకూటమితో జత కట్టాగా సీపీఎం భావ సారుప్యత పార్టీలతో కలిసి బీఎల్ఎఫ్‌గా బరిలోకి దిగింది. తాజాగా బీజేపీ కూడా కూటమికి ప్రయత్నిస్తూ ఉండటంతో తెలంగాణ రాజకీయాలు మరో ములుపు తిరిగాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories